Vijayagopal's Home Page

Kahlil Gibran 6
Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

This is the sixth instalment from "Sand and Foam".

ఆరవ భాగం
When you see a man led to prison say in your heart, "Mayhap he is escaping from a narrower prison."
And when you see a man drunken say in your heart, "Mayhap he sought escape from something still more unbeautiful."

బందిఖానాకు వెడుతున్న మనిషి కనబడితే, బహుశః అతనంతకన్నా ఇరుకయిన జైలునుంచి తప్పించుకుంటున్నాడేమో ననుకో.

ఇక ఒక తాగి తూలుతున్న మనిషి కనబడితే, బహుశః అంతకన్నా వికారమయిన పరిస్థితి నుంచి తప్పించుకుంటున్నాడేమో ననుకో.

Oftentimes I have hated in self-defense; but if I were stronger I would not have used such a weapon.

నన్ను నేను కాపాడుకోవడం తరుచుగా నాకిష్టముండదు. కానీ నేనింకా బలవంతుణ్ణి అయ్యుంటే అలాంటి ఆయుధం వాడి ఉండే వాడిని కాదు.

How stupid is he who would patch the hatred in his eyes with the smile of his lips.

పెదవుల మీది చిరునవ్వుతో కంట్లోని ఏవగింపును కప్పిపుచ్చాలనుకునే వాడు, ఎంతటి మూర్ఖుయి ఉండాలి.

Only those beneath me can envy or hate me.
I have never been envied nor hated; I am above no one.
Only those above me can praise or belittle me.
I have never been praised nor belittled; I am below no one.

నాకంటే దిగువన ఉన్నవాళ్లే నన్ను చూచి అసూయ పడతారు, ఏవగించుకుంటారు.

నాకెప్పుడూ అలాంటి పరిస్థితి ఎదురు రాలేదు. నేనెవరికీ ఎగువన లేను.

నాకన్నా ఎగువన ఉన్నవాళ్లే నన్ను పెగడగలరు, చిన్నజేయ గలరు.

నన్ను పొగడిన వారు లేరు, చిన్నజేసిన వారు లేరు. నేనెవరికీ దిగువన లేను.

Your saying to me, "I do not understand you," is praise beyond my worth, and an insult you do not deserve.
నేను నిన్ను అర్థం చేసుకోలేనని నీవు నాతో అనడం, నా విలువకు మించిన పొగడ్త, నీకు తగని అవమానం.

How mean am I when life gives me gold and I give you silver, and yet I deem myself generous.

జీవితం నాకు బంగారాన్నిస్తే, నేను నీకు వెండినిచ్చి, ఎంత ఉదారుడిని అని నేననుకుంటే, నేనెంతటి నీచుడిని



When you reach the heart of life you will find yourself not higher than the felon, and not lower than the prophet.

నీవు బతుకు మనసును చేరినప్పుడు, నీకు నీవు నీచునికన్న గొప్పకాదని, ప్రవక్తకన్న తక్కువ కాదని తెలుస్తుంది.

Strange that you should pity the slow-footed and not the slow-minded,
And the blind-eyed rather than the blind-hearted.

మందబుద్ధి గలవారిని గాక మందగమనం గలవారినీ, గుడ్డిమనసుగలవారిని గాక గుడ్డికళ్లు గలవారినీ, నీవు దయతో చూచావంటే, అది విచిత్రం.

It is wiser for the lame not to break his crutches upon the head of his enemy.

కుంటివాడు తన ఊతకర్రను, శతృవు తలమీద కొట్టి విరుచుకోకుండా ఉండడం, తెలివిగల పని.

How blind is he who gives you out of his pocket that he may take out of your heart.

నీ హృదయంలోంచి తీసుకునే బదులు, తన జేబులోంచి ఇచ్చేవాడు, ఎంత గుడ్డివాడు

Life is a procession. The slow of foot finds it too swift and he steps out;
And the swift of foot finds it too slow and he too steps out.

జీవితం ఒక ఊరేగింపు. నడవలేనివాడు వేగానికి తూగలేక తప్పుకుంటాడు.

వేగంగలవాడు, మరీ నెమ్మదిగా కదులుతున్నదని తప్పుకుంటాడు.

If there is such a thing as sin some of us commit it backward following our forefathers' footsteps;
And some of us commit it forward by overruling our children.

పాపం అంటూ ఒకటి ఉంటే, మనలో కొందరం, వెనక తిరిగి, మన పెద్దల దారిలో నడిచీ, కొందరం, ముందుకు కదిలి, చిన్నవాళ్లను పడనివ్వక, ఆ పాపం చేస్తాం.

The truly good is he who is one with all those who are deemed bad.

చెడ్డవాళ్లనుకున్న వాళ్లందరితోనూ కలిసి ఉండేవాడు, నిజమయిన మంచివాడు.

We are all prisoners but some of us are in cells with windows and some without.

మనమందరమూ బందీలమే. కొందరు కిటికీలున్న గదుల్లో కొందరు కిటికీలు లేని గదుల్లో ఉన్నామంతే.

Strange that we all defend our wrongs with more vigor than we do our rights.

మనం మన ఒప్పులకన్నా తప్పులను మరింత బలంగా సమర్థించుకోవడం విచిత్రం.

Should we all confess our sins to one another we would all laugh at one another for our lack of originality.
Should we all reveal our virtues we would also laugh for the same cause?

మనమందరమూ ఒకరి పాపాలొకరికి చెప్పుకుంటే, ఎవరికీ సొంత తెలివి లేదని నవ్వుకుంటాం.

మనమందరమూ ఒకరి గొప్ప గుణాలొకరికి చెప్పుకున్నా అదే కారణంగా నవ్వుకుంటాము.



An individual is above man-made laws until he commits a crime against man-made conventions; After that he is neither above anyone nor lower than anyone.

మనిషి చేసిన సంప్రదాయాలకు వ్యతిరేకంగా నేరం చేయనంత కాలం, ఎవడయినా మనిషి చేసిన చట్టాలకు అతీతుడు. నేరం చేస్తే మాత్రం, ఎవరికీ తక్కుకాడు, ఎక్కువా కాడు.

Government is an agreement between you and myself. You and myself are often wrong.

ప్రభుత్వమంటే నీకూ నాకూ మధ్య ఒప్పందం. నీవూ నేనూ మామూలుగా తప్పే


Crime is either another name of need or an aspect of a disease.

నేరమంటే అవసరానికి మరో పేరు, లేదా ఓ జబ్బుకు లక్షణం.

Is there a greater fault than being conscious of the other person's faults?

ఎప్పుడూ ఎదుటి మనిషి తప్పులను గుర్తించ గలగడంకన్నా గొప్ప తప్పు ఉందా

If the other person laughs at you, you can pity him; but if you laugh at him you may never forgive yourself.
If the other person injures you, you may forget the injury; but if you injure him you will always remember.
In truth the other person is your most sensitive self given another body.

ఎదుటి మనిషి నిన్ను చూచి నవ్వితే నువ్వు జాలి పడవచ్చు. కానీ నీవూ నవ్వినట్లయితే నిన్ను నీవు ఓనాడూ క్షమించలేవు.

మరో మనిషి నిన్ను గాయపరిస్తే, నీవా గాయాన్ని మరచిపోవచ్చు. కానీ నీవూ అతడిని గాయ పరచావనుకో, ఏనాడూ మరవలేవు.

నిజానికి ఎదుచి మనిషంటే, మరో శరీరంలోనున్న అతి సున్నితమయిన అస్తిత్వమే.

How heedless you are when you would have men fly with your wings and you cannot even give them a feather.

మనుషులు నీ రెక్కలతో ఎగరాలంటావు కానీ వారికి ఈకలు కూడా ఇవ్వలేవంటే, ఎంత పట్టిలేని మనిషివి

Once a man sat at my board and ate my bread and drank my wine and went away laughing at me.
Then he came again for bread and wine, and I spurned him;
And the angels laughed at me.

ఒకప్పుడొక మనిషి నా బల్ల దగ్గర కూచుని నా రొట్టె తిన్నాడు, నా వైన్ తాగాడు, నన్ను చూచి నవ్వుతూ వెళ్లిపోయాడు.

మళ్లీ రొట్టె, మద్యం కోసం వస్తే, నేను లేదన్నాను.

అప్పుడు దేవతలు నన్ను చూచి నవ్వారు..

Hate is a dead thing. Who of you would be a tomb?

అసహ్యం చచ్చిన వస్తువు. మీలో ఎవరు దానికి సమాధి అవుతారు?

It is the honor of the murdered that he is not the murderer.

హతుడు తాను హంతకుడు కాకపోవడం ఒక గౌరవం.

Enter supporting content here