Vijayagopal's Home Page

33 - Part 2 of the story

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

Second part of the story

ముప్ఫయిమూడు - రెండవభాగం

 

తనకక్కడ ఒక ఆకారం అందరూ కలిసి ఇచ్చిన ఆకారం అది వదిలేసి వచ్చాడా అదే మళ్లీ ---- అప్పుడంటే చిన్నవాడు అందుకని అలా ఊరుకున్నాడు ఇప్పుడు మరి తప్పించుకోను వీల్లేదు మొదటినుంచి మళ్లీ మొదలు అలాకాదు ఆగాలి

వాడు మౌళి వాడికెప్పుడూ సాయం కావాలి

వాడికి అందరి మీదా అనుమానమే

అన్నీ తనవల్లేనంటాడు

తనదగ్గర ఉన్నదంతా వాడికే అయిందప్పుడు

ఇప్పుడు వాడు బాగు పడ్డాడు దశ తిరిగింది

తన డబ్బు తిరిగి ఇస్తాడా వాడు

అడిగితే ఎముకలు విరుస్తాడేమో

అనాడంటే వాడికి అవసరం తరువాత తనగురించి కథలల్లాడు తన పరువు తీశాడు కొంచెం కొంచెమే

అందరి మాటలనూ అందుకుని మరింత పెంచి మౌళి- కనిపించిన ప్రతి పురుగుతోనూ తనగురించి సానుభూతిగా వాడు లేకుంటే వాడినీడలు దూరందాకా ఘోరంగా మౌళి అంతంలేనివాడు ఆఘాయిత్యాలవాడు కేవలం అప్పు కోసం - -- ఇలా --- ఇంతనీచంగా -----

వాడికి నళినీ తెలుసు ------

 

ఈ సంవత్సరం చెడ్డదిలాగుంది - అరిష్టాలన్నీ తనపైకి దూసుకువస్తూ విరుచుకుపడుతూ ఇప్పటితోనేనా జీవితాంతం బతికినన్నాళ్లూ తనని కరుస్తూ కాలుస్తూ వీడొకడు మౌళి ------

 

ఈ మౌళిగాళ్లనందరినీ ఎదుర్కోవాలి ఎందరో ఎందరో ---- అందరినీ --- కానీ ---వీడుమాత్రం ఒక్కడే పిచ్చెత్తుతున్నట్టు నిజంగా ఫ్రెండంటూ ఎవడన్నాఉన్నాడా అన్నట్టు అంతా మోసం ----

 

నళిని----

తనని క్షమించినట్టు మాట్లాడుతూ

ఆనాడు బ్లాక్ మెయిల్ చేసి, భయపెట్టి, సర్వనాశనం చేసి, ఎప్పుడది, మొన్నమొన్ననే ---- కొన్నిసంవత్సరాలైనా కాలేదు ---

 

ఇప్పుడు

తాను ఫ్రెండా ఎంతతెలివిగా ---కలుపుగోలుగా --- కరుణతో ---అవును --- ఇప్పుడు తనకు పెళ్లి అయిపోయిందిగా ---

తానే ఒప్పుకున్నాడు మోసం చేశానని --- అన్యాయంగా ---

ఇప్పుడు నళినికొక పాపకూడా ----

తనకేమీ పట్టనట్టు మాట్లాడుతుందేమి

తనకు బాధలేనట్టుందేమి

ఆడవాళ్లు అంతేనేమో

అశ్చర్యం --- ఆనిండుతనం --- ఆ నిర్లక్ష్యం ---

 

తనదే తప్పా ---నమ్మకం కలగకుండా --- తను అలా పారిపోతే తప్పక ఇంకో మగవాణ్ణి కట్టుకున్నదనుకుంటూ ----- యింకా ---  నయం ----

 

తనదే తప్పా నళినీ --- తాను కూడా అలానే అనుకుంటున్నట్టు ---నీదే తప్పోయ్ ---

ఛీ నేనేం చేశాను బాధపట్టలేక అప్పుడలా అనుకున్నాను ఇప్పుడంచా క్లియర్ గా ఉందికదూ --- కానీ యిలా అనుకుంటే --- ఇదేమీ బాగుండలేదు

 

ఈ సంవత్సరం అంతా సర్వనాశనం కాకుండా ఉంటే ఉంటే అదే పదివేలు ---

అజంతా గుహలు చూడవచ్చు --- అహమదాబాదూ వెళ్లవచ్చు

ఃఃఃఃఃఃఃఃఃఃఃఃః

ఈ పాతఊరు --- ఎంతో అందంగా ఉంటుంది ---అయినా ఇక్కడ బతకడం మాత్రం కష్టం --- సహం మిత్రులు --- పూర్తి మిత్రులూ --- వాడు మౌళి --- మౌళిగానికి మౌళిగాంటే పడదు --- వాళ్లిద్దరికీ ఈ మూడో మౌళిగాంటే మంట ---- నీవు నిలబడ్డ నీడను అందరూ తలొకదిక్కునుంచి చిల్లులు పొడుస్తూ -----

నీకందరూ కావాలి --- నీవందరికీ కావాలి --- ఆమాట మాత్రం నోట్లోంచి రాదు ---

తప్పించుకోనూ లేవు --- నావు ఏసాకుచెప్పినా సవాలక్ష అర్థాలు ---

ఉత్తరంరాయకుంటే నీకు గర్వమంటారు --- ఆలస్యం చేస్తే అర్భకుడంటారు ---

కానీ ఇదంతా ఎప్పుడు ఎట్లా మొదలయింది ---సంఘంచేతిలో తాను ఆనాడు అట్లా చిక్కిననాడేకదా బతకాలంటే ఒకతనలోనుంచి ఇంకొకడు ఇంకొకడు ఇంకెందరో --- వస్తూ --- మంచితనం మైత్రి ఉన్నాయా నీవు నమ్మకపోతే నిన్నూ నమ్మరు ----

అపనమ్మకం అంతదాకా --- అందరిమీదా --- చస్తేనే అన్నీ సమసిపోతాయి ---

ఎండలు రోజులను కొలిమిలోవేసి కాలుస్తూ --- సమ్మెటవేస్తూ --- కాలం ప్రతిధ్వనిస్తూ ---

సముద్రం అలిసిపోయింది ---  గాలీ అలిసింది --- నేలా అలిసింది ---

మనిషి మాంసం వాని శరీరానికి లంచం ---- ఏటిగట్టున, ఇసుకతిన్నెల్లో శరీరాల లంచం -----

ఎండలూ సమసిపోతాయి అందుకనే ఆలోపలే అందరినీ మింగేయాలని తాపత్రయపడుతూ ---

ఆ ఇసుకల్లో, ఆరాళ్లలో, ఆ గుడిసెల్లో, ఆ చెట్లల్లో, అమ్మాయిలు హత్తుకుంటూ ---

ఊళ్లో మధ్యాహ్నం ఎండలో, మసక తెరల చాటుగా, మగతనిద్ర మాటుగా, హైహీల్డ్ చెప్పులు జారిపడితే, ముందున్న నడుం వాటేసుకుని సారీ ----

ఆ ఎండల్లో అంతా నిశ్శబ్దం ఉలుకూ పలుకూ లేకుండా ---

నగరంనుంచి నదిదాకా --- నల్లకళ్లూ పిల్లికళ్లూ ఈ ఆకలి ఆ ఆకలి --- ఇసుకలో వెలుగూ చెట్లకింద చీకటి ---ఎండల్లో పడుతూ లేస్తూ ---

 

సూర్యుడూ అలిసిపోయాడు ఏరోజుకారోజే ఆలస్యం చేస్తున్నాడు --- త్వరగా లేస్తున్నాడు ---

నీళ్లు నీళ్లు దప్పిక ఏరు ఎండిపోతున్నది

అందరినీ ప్రేమిస్తున్నాడా మూకుమ్మడిగా ---

ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః

ఇంకా ఉంది