Vijayagopal's Home Page

Wonderfood!

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

A science fiction story published in Udayam weekly.
I thank Sri Palakodeti who insisted I write this.

వండర్ ఫుడ్

 

ఆదివారం, సాయంత్రం. ఆకలి దంచేస్తోంది. ఇంట్లో  ఎవరూ లేరు. మా  యావిడ ఛాదస్తం. ఈ కాలంలో  కూడా పెళ్ళిళ్ళకు ఓవర్నైట్ప్రయాణాలేమిటో! మనకి ఈ విందులూ వినోదాలూ జాన్తేనై! అవకాశం దొరికితే హాయిగా బయట ఏదైనా హోటల్లో ఝూమ్మని నాన్వెజ్లాగించి పారేయాల్సిందే! అవును! అన్నట్లు ఈ రోజుకన్నా  ఇందుకు మంచి తరుణం మించిన దొరుకునా! ఛల్మోహనరంగా!

రేడాన్లైట్లతో  త్రీడైమెన్షన్హోలోగ్రాం బోర్డు అందంగా ఆహ్వానిస్తోంది. `సాఫ్ట్ టెక్‌' ఆ బొమ్మ దగ్గరకు పోతున్నకొద్దీ దూరంగా దగ్గరగా కదులుతున్నట్లుంది.  పర్సనల్కమ్యూటర్పార్కింగ్వాడికి అప్పజెప్ప లెవిటేటర్లో హోటల్డాబా మీద దిగాను.

 `` ఇటు వేపు జెంటిల్మన్‌! మీ టేబుల్నంబర్‌ 3 ఎక్స్' అనౌన్స్ చేసింది రిసెప్షనల్లోని రోబో. క్రెడిట్కార్డును రోబో చేతికి అందించి, లోపలికి నడిచాను. 3X  లో  గ్రీన్లైట్వెలుగుతోంది.వెళ్ళి కూచున్నా. వెయిటర్తొందరగానే వచ్చింది. ఫరవాలేదు.! ఇంకా వీళ్లు మనుషులకు మనుషులచేత తిండి పెట్టిస్తున్నారు!

`` ఎస్‌! జెంటిల్మన్‌! ఏం ఇమ్మంటారు?''

``మెనూ!''

`` అదే తింటారా?''

బోడి సెన్సాఫ్హ్యూమర్‌! మనసులోనే అనుకున్నాను.

``వీలయితే అభ్యంతరం లేదు!''

``యువర్విష్‌! బట్ట్రై చేయకండి! ఇది ఎడిబుల్పేపర్కాదు. తిన్నా  అరగదు!'' వంకరగా నవ్వి  మెనూ టేబుల్మీద పెట్టి లోపలికి వెళ్ళింది.

కార్డు చేతిలోకి తీసుకుని  పేజీలు తిప్పాను. అందులో అన్నీ  బొమ్మలే. అవన్నీ లేచి టేబుల్మీదకు దిగుతాయేమోనన్నట్లు కదులుతున్నాయి కూడా. వాటితో బాటు ఏవో నంబర్లు. ఒక పట్టాన అంతుపట్టలేదు. కొత్త హోటల్కు రావడం బుద్ధితక్కువ అనుకున్నాను. యూజర్ఫ్రెండ్లీ  అనే మాట వీళ్ళ కింకా అర్ధమయినట్లు లేదు.  అనుకుంటుండగానే  గాజుకళ్లు మిల మిలలాడిస్తూ వెయిటరమ్మాయి మళ్ళీ ప్రత్యక్షం!

``యువర్ఆర్డర్జెంటిల్మన్‌!''

``జింజర్చికెన్‌’’ తెలిసిందేదో చెబితే బాధ వదిలిపోతుందన్న భావంతో నెమ్మదిగా అన్నాను.

`` ఎన్ని?''

 మళ్ళీ అదే సెన్సాఫ్హ్యూమర్గావును! మనసులోనే అనుకున్నాను

``ఎన్నేమిటి ఒకటి!''   

``ఒకటా? ఒకటి.... ఒకటి ఎలా జంటిల్మన్‌?'' అమ్మాయి ముఖంలో స్పష్టంగా ప్రశ్న!

బకాసురుడా అని తెలుగులో అంటుందిగావును

``పోనీ ముందు ఒక హాఫ్ఇవ్వడి'' ఈ సారి ఆ అమ్మాయి పగలబడి నవ్వినంత పనిచేసింది. అంతలోనే తమాయించుకుని ``కనీసం ఒక డజన్  ఆర్డరివ్వండి జెంటిల్మన్‌. తరువాత కావాలంటే మరేదయినా తీసుకుందురుగాని!'' అంది.

 నాకు కోపం వచ్చింది. నేనాకలితో ఛస్తుంటే ఈవిడ జోకులు. కానీ తిండికోసం కమ్యూటర్ను వాడుకుని  పై ఊరికి వచ్చాను  ఇక్కడ  ఈఅమ్మాయితో  కీచులాడే  మూడ్లేదు! ముఖంలో ఏ భావమూ లేకుండా  చూశాను.

``సారీ జెంటిల్మన్‌! మీరు నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. నాకు తెలుసు ఇది కొత్తేమీ కాదు. మీరు బహుశః మా దగ్గరికి తొలిసారిగా వచ్చారు. అందునా మెనూలో మొదటి పేజీ మిస్చేసి ఉంటారు కూడా. మా హోటల్ను బయొటిక్ఫార్మ్స్ వారు స్పాన్సర్చేస్తున్నారు. జీవ సాంకేతిక పద్ధతిలో తయారు చేసిన చిన్న చిన్న అంటే  మినియేచర్ఐటమ్స్ మా స్పెషాలిటీ అవి కూడా రెడీ టూ ఈట్‌! మీరేమీ అనుకోకపోతే  మీకు నేను సజెస్ట్ చేసిన కోర్స్ తీసుకోండి! యూ విల్ఎన్జాయ్ఇట్‌!'' క్షణంలో  మాయమయింది.

 అదే స్పీడుతో ట్రాలీతో తిరిగి వచ్చి టేబుల్సర్దింది. వెండి రంగు  కాసరోల్స్ తళతళలాడుతున్నాయి. వాసన గుబాళిస్తున్నది.

మూత తీస్తే ఇంకెంత బాగుంటుందో అనుకుంటూనే, బెరుకుగా, సస్పెన్స్ గా కాసరోల్మూత తీసి పక్కన పెట్టాను.

``బాప్రే!'' అనుకోకుండా నోట్లోంచి మాటలు బయటకు వచ్చేశాయి. కాసరోల్లో డజను కోడిపిల్లలు ఆలూ బజ్జీలో అరసైజుకు  ఉన్నాయి. తలమీద కిరీటం, రంగు రంగుల ఈకలు, మొత్తం శరీరంతో సహా,తిరగడం లేదు! కానీ కదులతున్నాయి.  బతికున్నాయేమోననిపిస్తున్నాయి కూడా! నేను చిక్కులో పడ్డాను.

``సారీ జెంటిల్మన్‌! ఒక్క క్షణం పక్క టేబుల్దగ్గకు వెళ్ళవలసి వచ్చింది. నాకు తెలుసు మీరు  కనుఫ్యూజ్అవుతారని. అందుకే వచ్చేశాను'' నవ్వింది.

`` ఏమిటి? ఇప్పుడు వీటిని వండుకోవాలా?'' ఈసారి నేను జోకాను!

`` ఆకష్టం మీకు అక్కరలేదు. బయోటెక్వాళ్ళే వండి వార్చి పంపారు వీటిని. మిగతా మూడు కాసరోల్స్ లో మూడు  రకాల సాస్లున్నాయి. చేయవలసిందల్లా  మీరు ఒక్కొక్క చిక్ను తీసి మీ ఇష్టం వచ్చిన సాస్లో ముంచి నోట్లో వేసుకోవడమే! మరిచిపోయాను. వాటిని కట్చేసే ప్రయత్నం మాత్రం చేయకండి! అరిచినా అరుస్తాయి!

Next...

This story is based on some scientific developments presented to AAAS