Vijayagopal's Home Page

Wonderfood .... (Contd)

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

Read on ......

`` ఇవేమిటి బ్రతికున్నాయా కొంపదీసి?'' అనుమానం ధైర్యంగానే బయటపెట్టాను.

``లేదు! కానీ త్రిల్కోసం వాటికి కదలిక, అరుపు ఏర్పాటు  చేశాం!''

`` అవునూ! ఈకలు గొంతుల్లో ఇరుక్కోవా?'' కాస్త ధైర్యం వచ్చినట్లుంది.

`` నెవర్‌! నిజానికి వాటి రంగు బట్టి సీజనింగ్గ్రేడ్గుర్తించవచ్చు!

రంగు ఎంత డార్క్ గా ఉంటే అంతబాగా ఉడికినట్లు లెక్క! ఇక మీరు కానివ్వండి! మళ్ళీవస్తాను!'' మాయమయింది వెయిటర్అమ్మాయి.

వీటిని కట్చేయకూడదు. అందుకే  కాబోలు ఫోర్క్, నైఫ్బదులు అందమయిన టాంగ్స్ ఇచ్చారు. నెమ్మదిగా మొదటి కోడిని  పట్టుకుని  తెల్లని సాస్లో ముంచి నోట్లో వేసుకున్నాను. బ్రహ్మాండం! ఇది బటర్చికెన్‌! ఏం రుచి నములుతుంటే  ఈకలు ఎముకలు కరకరలాడుతూ భలేగా ఉంది. నెమ్మదిగా జింజర్చికెన్‌, లిక్కర్చికెన్కూడా ట్రైచేశాను. భలేగా ఉన్నాయి.

`` ఇంతకూ వీటినేమంటారు మిస్‌!'' ఈసారి చాలా సులభంగా అడిగేశాను.

``వాటికో ప్రత్యేకమయిన పేరేమీలేదు! మినీ చిక్అంటే చాలు! త్వరలోనే హైదరాబాద్‌, విజయవాడల్లో  కూడా వీటిని ఇంట్రడ్యూస్చేస్తారట మా వాళ్లు. మీరు అక్కడ ఎంజాయ్చెయ్యవచ్చు!'' అంటూ నా క్రెడిట్కార్డ్ ప్లేట్లో పెట్టి తిరిగి  ఇచ్చింది.

సైన్స్ అభివృద్ధి  చెందుతోందని తెలుసు. బయో టెక్నాలజీ సాయంతో మందులు, పంటలు వగైరా పెంచుతున్నారని తెలుసు. పశువులను పెంచుతున్నారని కూడా తెలుసు! కానీ ఈ మినీ చిక్గురించి  మాత్రం వినలేదు. హ్యాట్స్ ఆఫ్‌! అందుకే తాతయ్య అంటూ ఉండే వాడు `` తెల్లోడిబిస!'' అని.

నేను మినీఫుడ్ఫాన్అయిపోయాను. అవకాశం చిక్కినప్పుడల్లా  ఏదో ఒక టెక్ఫుడ్స్టాల్లో  దూరి ఏదో ఒకటి తింటూనే ఉన్నాను. బాతులు, మేకలు, కుందేళ్లు, ఒకటేమిటి రకరకాలు వస్తున్నాయి ఈమధ్యన. మొన్న అబిడ్స్ లో అదేదో స్టాల్లో  మినీ టార్టాయిస్తిన్నాను. వింతగా ఉంది. బయోటిక్విచిత్రంగానే ఉంది. గొర్రె ఉన్ని తిన్నా, తాబేలు బొచ్చె తిన్నా రుచిగానే ఉన్నాయి. అంతకంటే ఆశ్చర్యం మినీ ఫ్రూట్సలాడ్‌! బౌల్నిండా ఛెర్రీస్సైజ్లో  పుచ్చపళ్లు, మామిడి పళ్లు, కర్బూజాలు, ఒక్కొక్కటే  తీసి నోట్టో వేసుకుంటే  కరిగిపోతున్నాయి. రుచి ఫెంటాస్టిక్‌, మామిడి కాయలో టెంక కూడా ఉంది.  నమిలితే అచ్చు కాజూ రుచిలో ఉంది. తొక్కలు ఘుమఘుమ లాడుతున్నాయి. వీటన్నింటిలోకి బత్తాయిలు చాలా బాగున్నాయి.  తొక్క లోపలనుంచి  తొనలు కనపడుతున్నాయి కూడా!

పేపర్లో కనబడ్డ ప్రతి అడ్వర్టయిజ్మెంట్నూ ఫాలో చేస్తూ ఊర్లో ఉన్న మినీ ఫుడ్స్టాల్స్ అన్నీ పావనం చేశాను. ఈ మధ్యనే సికింద్రాబాద్లో ఒక చోట మినీ ఫిష్ప్రారంభించారు. వాళ్ళ స్పెషాలిటీ డిష్ఏమిటో తెలుసా? మినీ తిమింగలం! అయితే ఒక్కడినీ తినడం కుదరదన్నాడు. కనీసం నలుగరయినా కలిసి వస్తే సర్వ్ చేస్తానన్నాడు. తిమింగలాలు తరిగిపోకుండా కాపాడారని పేపర్లో చదివాను. కానీ అవి సంఖ్యలో పెరిగి సైజులో తరిగి డైనింగ్టేబుల్మీదకు వస్తాయని మాత్రం అనుకోలేదు. దీన్నెలాగయినా  టేస్ట్ చేయాలి! కంపెనీ కోసం వెదకాలి!

########

 

కాన్ఫరెన్స్ అయిపోయింది.  సాయంత్రం బజారులో పరధ్యానంగా నడుస్తున్నాను. కాస్తేదయినా తింటే  వెళ్ళి నడుం వాల్చవచ్చు.  నిజానికి ఆకలిగా లేదు. మధ్యాహ్నం చాలా పద్ధతిగా భోజనం ఏర్పాటు చేశారు. ట్రెడిషనల్భోజనాలు అలవాటు లేకుండా ఉంది. అయినా బాగానే తిన్నాను. కాబట్టి కొంచెం ఏదయినా తింటే చాలు. తళుక్కున `సాఫ్ట్ టెక్‌' గుర్తొచ్చింది.  నా మినీ ఫుడ్తొలి అనుభవం  ఈప్రాంతంలోనే అనేమాట కూడా గుర్తొచ్చింది. వీధి చివర ` ఇన్ఫర్మేషన్  కౌంటర్‌' లోకి వెళ్ళాను.

` ఇక్కడి నుంచి సాఫ్ట్ టెక్చాలా దగ్గరే అనుకుంటాను. ఎలా వెళ్ళాలో చెప్పగలరా?''

`` వెల్కం! జెంటిల్మన్‌! అంతకన్నా మంచి ఫుడ్స్టాల్పక్కనే ఉంది. ``బిగ్టెక్‌'' ట్రై చేయకూడదూ? ఇదుగో ఈ పక్క బిల్డింగులోనే!రండి చూపిస్తాను'' అంటూ అతను లేచి దారి తీశాడు.

అప్రయత్నంగా  అతని వెనకాల నడిచాను.

 ఎల్సి డి డిస్ప్లే బోర్డులో`బిగ్టెక్‌' అన్న చిన్న చిన్న అక్షరాలు రకరకాల రంగుల్లో మెరిసి మాయమవుతున్న ఒక స్టాల్లోకి చేరుకున్నాం. ``వెల్కం ఫ్రెండ్స్! మీ టేబుల్నంబర్‌ `జి డబుల్ఎక్స్' అన్నాడు కౌంటర్లో అబ్బాయి.

``థాంక్యూ! నేను భోజనానికి రాలేదు. ఒక కొత్త నేస్తాన్ని  తీసుకువచ్చాను. హెల్ప్ హిమ్‌! అని నాతో బాటు వచ్చినతను సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు `రండి ఫ్రెండ్‌! మీకు `డి. ఎక్స్' అలాట్చేస్తాను! యువర్కార్డ్ ప్లీజ్‌! అంటూ అబ్బాయి కంప్యూటర్లో  ఏవో కమాండ్స్ పంచ్చేశాడు. హాల్లో డి ఎక్స్ సులభంగానే  దొరికింది. టేబుల్మీద మెనూ కార్డు రెడీగా ఉంది. అదొక ఎలక్ట్రానిక్మానిటర్లాంటిది. కీస్నొక్కుతూ లైట్అయిటమ్స్ కోసం వెదికాను. ఒక పేజ్లో ఎగ్స్, మరొక పేజ్లో పళ్లు కనబడ్డాయి. ఒక ఎగ్కాసిని గ్రేప్స్ ఆర్డర్పంచ్చేశాను. ``వీటిని ఎక్కడ డెలివర్చేయమంటారు?'' అనే ప్రశ్న మానిటర్తెరమీద వచ్చింది.

`` ఇక్కడే తింటాను'' అని జవాబు ఎంటర్చేశాను.

`` ఇంపాజిబుల్‌! మీరు ఒక్కరే  ఉన్నారు!'' జవాబు.

నేను మళ్ళీ చిక్కుల్లో పడ్డాను.

`` ఒకసారి ఇలా వస్తారా?'' కౌంటర్లో అబ్బాయిని పిలిచాను.

`` నాకు తెలుసు! మీరిలా పిలుస్తారని. మీ కమాండ్స్ నేను చూస్తూనే ఉన్నాను.  ఒక ఎగ్‌, కొన్ని ద్రాక్షపళ్లు తినాలంటే  మీరు పురాణకాలం నాటి హీరో అయి ఉండాలి.

 ఇన్ఫర్మేషన్అతను మీకు మా స్టాల్గురించి చెప్పలేదనుకుంటాను. అతను సరదాకోసం అలా చేసి ఉంటాడు. మా స్పెషాలిటీ బిగ్ఫుడ్బయోఫుడ్ఫార్‌‌మ్స్  వాళ్లు కొత్త టెక్నాలజీ  ఇంట్రడ్యూస్చేశారు.  వాళ్లు సప్లై చేసే ఒక బాయిల్డ్ ఎగ్  మీ కుటుంబానికంతా సరిపోతుంది.  మీరు మహా అయితే ఒక ద్రాక్షపండు తినగలరు. రొయ్యలు, మష్రూమ్స్, రకరకాలు సూపర్సైజుల్లో  మా దగ్గర దొరుకుతాయి. ఎక్స్ టేబుల్లో మామూలు ఆర్డరు స్మాల్సైజ్స్లైస్కన్నా ఎక్కువ ఉంటే మా కంప్యూటర్హోమ్డెలివరీ కింద లెక్క పెడుతుంది. మీరు ఒక ముక్క ఎగ్‌, ఒక ముక్క గ్రేప్ఆర్డర్చేయండి. రోబో తెచ్చి పెడుతుంది!'' అన్నాడు ఆ  అబ్బాయి.

 ఈసారి నాకు కోపం రాలేదు. ఆశ్చర్యం అంతకన్నా లేదు!

`` వండర్ఫుల్బయోటెక్నాలజీ!'' అనుకున్నానంతే!

Your Opinion Please!