Vijayagopal's Home Page

Kahlil Gibran

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

This is the first instalment of Kahlil Gibran's works that I propose to bring to you. Presently there are eight pages available. Links to the next pages at the end of this page please!

Sand and Foam

ఇసుక నురగ

by Kahlil Gibran

ఖలిల్ జిబ్రాన్

I AM FOREVER walking upon these shores,

నేను నిరంతంరం ఈ తీరాల మీద నడుస్తున్నాను
Betwixt the sand and the foam,

ఇసుక నురగల మధ్యన
The high tide will erase my foot-prints,

అలలు పోటెత్తి నా అడుగుజాడలను తుడిపేస్తాయి.
And the wind will blow away the foam.

ఇక గాలి ఈ నురగను ఊదేస్తుంది.
But the sea and the shore will remain

కానీ, ఈ సముద్రం ఈ తీరం మాత్రం ఉండిపోతాయి.
Forever.
కలకాలమూనూ.

 

Once I filled my hand with mist.

ఒకప్పుడు నా చేతిని తుహినజలంతో నింపుకున్నాను.
Then I opened it and lo, the mist was a worm.

చెయ్యి తెరిస్తే ఆశ్చర్యం, నీరంతా ఒక పురుగయింది.
And I closed and opened my hand again, and behold there was a bird.

ఇక మరో సారి నేను నా చేతిని మూసి తెరిచాను, చూస్తే అందులో ఒక పక్షి ఉంది.
And again I closed and opened my hand, and in its hollow stood a man with a sad face, turned upward.

ఇక మరో సారి నేను నా చేతిని మూసి తెరిచాను, ఆ ఖాళీలో ఒక మనిషి ఏడుపుముఖంతో నిలుచున్నాడు, పైకి చూస్తూ.
And again I closed my hand, and when I opened it there was naught but mist.

ఇక మరో సారి నేను నా చేతిని మూశాను, దాన్ని తెరిచినప్పుడు అందులో నీరు తప్ప మరేమీలేదు.
But I heard a song of exceeding sweetness.

కానీ అంతులేని మాధుర్యంగల పాటవినబడింది.


 

It was but yesterday I thought myself a fragment quivering without rhythm in the sphere of life.

నిన్ననేగదా నన్నునేను, జీవనగోళంలో లయలేకుండా కదులుతున్న శకలం అనుకున్నాను.
Now I know that I am the sphere, and all life in rhythmic fragments moves within me.

ఇప్పుడు నాకు నేనే ఆ గోళాన్నని తెలుసు. జీవమంతా లయబద్ధ శకలాలుగా నాలోనే కదులుతుందనీ తెలుసు.


 

They say to me in their awakening, "You and the world you live in are but a grain of sand upon the infinite shore of an infinite sea."

వాళ్లంతా మెలుకువగా ఉన్నప్పుడు నాతో చెపుతారు, నీవు, నీవుంటున్న ప్రపంచం, అంతులేని సముద్రపు అంతులేని తీరం మీద ఒక్క ఇసుకరేణువు మాత్రమేనని.
And in my dream I say to them, "I am the infinite sea, and all worlds are but grains of sand upon my shore."

ఇక నేను నా కలలో వారికి చెపుతాను, నేనే అంతులేని సముద్రాన్నని, ఈ ప్రపంచాలన్నీ నా తీరం మీద ఇసుకరేణువులు మాత్రమేననీ.


 

Only once have I been made mute. It was when a man asked me, "Who are you?"

నేనొక్కసారి మాత్రమే అవాక్కయ్యాను. ఒక మనిషి నన్ను నీవెవరు అని అడిగినప్పుడు.


 

The first thought of God was an angel.

దేవుని మొదటి ఆలోచన ఒక దేవదూత.
The first word of God was a man.
దేవుని మొదటి పలుకు ఒక మనిషి.

 

We were fluttering, wandering, longing creatures a thousand thousand years before the sea and the wind in the forest gave us words.

మనమంతా, వేలవేల సంవత్సరాల క్రితం, సముద్రం, గాలీ, అడవి మనకు మాటలు నేర్పక ముందు, కొట్టుమిట్టాడుతూ, తిరుగాడుతూ, కోరికలు గల జీవులుగా ఉన్నాం.
Now how can we express the ancient of days in us with only the sounds of our yesterdays?

ఇక మనం ఇప్పుడు, మనలోని దినాల పాతదనాన్ని, నిన్నటి మాటలతో ఎట్లా తెలుపగలుగుతాం


 

The Sphinx spoke only once, and the Sphinx said, "A grain of sand is a desert, and a desert is a grain of sand; and now let us all be silent again."

స్ఫింక్స్ ఒకేసారి మాటాడింది, స్ఫింక్స్ అన్నదిగదా, ఒక్క ఇసుకరేణువే ఎడారి, ఇక ఎడారి అంటే ఒక్క ఇసుకరేణువు మాత్రమే, ఇక ఇప్పుడు మనం మళ్లా మౌనంగా ఉందాం అని.
I heard the Sphinx, but I did not understand.

నేను స్ఫింక్స్ మాటలు విన్నాను, కానీ నాకు అర్థంకాలేదు.


 

 

Long did I lie in the dust of Egypt, silent and unaware of the seasons.

నేనెంతో కాలం ఈజిప్టు దుమ్ములో పడి ఉన్నాను, నిళ్ళబ్దంగా, కాలం గతి తెలియకుండా.
Then the sun gave me birth, and I rose and walked upon the banks of the Nile,

అప్పుడు సూర్యుడునాకు బతుకునిచ్చాడు, ఇక నేనులేచి నైలు గట్లమీద నడిచాను,
Singing with the days and dreaming with the nights.

పగలు పాడుతూ, రాత్రులు కలలుగంటూ.
And now the sun threads upon me with a thousand feet that I may lie again in the dust of Egypt.

నేను మళ్లీ ఈజిప్టు దుమ్ములో పడి ఉండాలని, సూర్యుడు నన్ను చుట్టుకుంటాడు.
But behold a marvel and a riddle!

కానీ  వింతనూ చిక్కుప్రశ్ననూ చూడండి
The very sun that gathered me cannot scatter me.

నన్ను ఒకటిచేసిన సూర్యుడు నన్ను చెదరగొట్టలేడు.
Still erect am I, and sure of foot do I walk upon the banks of the Nile.

నేనింకా నిటారుగా నిలుచున్నాను, నైలు గట్లమీద నమ్మకంగా నడయాడుతున్నాను.


Remembrance is a form of meeting.

గుర్తుండడమంటే కలయికలకు మరో రూపం.
Forgetfulness is a form of freedom.

గుర్తుండకపోవడం స్వతంత్రానికి మరో రూపం.



We measure time according to the movement of countless suns; and they measure time by little machines in their little pockets.

మనం కాలాన్ని అంతులేని సూర్యుల కదలికలను బట్టి లెక్కవేస్తాం. వాళ్లుమాత్రం కాలాన్ని వాళ్ల చిన్ని జేబుల్లో ఉన్న ఒక చిన్ని యంత్రంతో కొలుస్తారు.
Now tell me, how could we ever meet at the same place and the same time?

ఇప్పుడు చెప్పండిక మనం ఒకేచోట, ఒకే సమయాన కలవడం ఎలా వీలవుతుంది


Space is not space between the earth and the sun to one who looks down from the windows of the Milky Way.

పాలపుంత కిటికీలోంచి కిందకు చూచే వాళ్లకు, అంతరిక్షం అంటే భూమికి సూర్యునికీ మధ్యనుండే శూన్యం కానేకాదు.

Humanity is a river of light running from the ex-eternity to eternity.

మానవత అంటే మాజీ అనంతంనుంచి అనంతానికి ప్రవహించే ఒక నది.

Do not the spirits who dwell in the ether envy man his pain?

అనంతవాయువుల్లో నివసించే భూతాలు మనిషి బాధను చూచి భాధ పడతాయిగదూ


 

 

 

 

On my way to the Holy City I met another pilgrim and I asked him, "Is this indeed the way to the Holy City?"

పవిత్ర నగరానికి దారిలో మరో ప్రయాణికుణ్ని కలిసి నేనడిగానూ, పవిత్ర నగరానికి దారి ఇదేనా అని
And he said, "Follow me, and you will reach the Holy City in a day and a night."

నావెంటే నడువు ఒక పగలు ఒక రాత్రిలో పవిత్రనగరం చేరుకుంటావు అన్నాడతను.
And I followed him. And we walked many days and many nights, yet we did not reach the Holy City.

ఇక నేను అతనివెంటే నడిచాను. మేం ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్లు నడిచాము, కానీ పవిత్రనగరం చేరనే లేదు.
And what was to my surprise he became angry with me because he had misled me.

ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించిందేమిటంటే, నన్ను దారి తప్పించినందుకు అతనికి నా మీద కోపం వచ్చింది.


 

Make me, oh God, the prey of the lion, ere You make the rabbit my prey.
ఓ దేవుడా నన్ను సింహానికి ఎరగా చెయ్యి. ఇక కుందేటిని నాకు ఎరగా చెయ్యి.

 

One may not reach the dawn save by the path of the night.

రాత్రి బాటన నడిచి తప్ప ఉషస్సును చేరడానికి వీలులేదు.


 

My house says to me, "Do not leave me, for here dwells your past."

నన్ను వదలకు, నీ గతమంతా ఇక్కడే ఉంది, అంటుంది నా ఇల్లు నాతో.
And the road says to me, "Come and follow me, for I am your future."

నా వెంటరా, నీ భవినేనే, అంటుంది రహదారి నాతో.
And I say to both my house and the road, "I have no past, nor have I a future. If I stay here, there is a going in my staying; and if I go there is a staying in my going. Only love and death will change all things."

ఇక నేను మాత్రం ఇంటికీ రహదారికీ ఒకే మాట చెపుతాను. నాకు గతం లేదు, భవిత అంతకూ లేదు. నేనిక్కడే ఉండిపోతే నా నిలకడలో ఒక పోవడముంది. ఇక నేను బయలుదేరితే నా నడకలో ఒక నిలకడ ఉంది. కేవలం ప్రేమ మరణాలు మాత్రమే అన్నింటినీ మార్చగలుగుతాయీ అని.

 

To the Second page!

Page three

Page Four

Page Five

Page Six

Page Seven

Page Eight

More in the offing!