Vijayagopal's Home Page

Kahlil Gibran 2

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

More from Kahlil Gibran's Sand and Foam

How can I lose faith in the justice of life, when the dreams of those who sleep upon feathers are not more beautiful than the dreams of those who sleep upon the earth? Strange, the desire for certain pleasures is a part of my pain.
హంసతూలికల మీద నిదురించిన వారి కలలు నేల మీద పడుకున్నవారి కలలకన్నా అందమయినవి కానప్పుడు, నేను జీవన న్యాయం మీద నమ్మకాన్ని ఎలా వదులుకుంటాను. విచిత్రం, అదేదో ఆనందం కొరకు నా తపన, నా దుఖంలో భాగమయింది.


 

Seven times have I despised my soul:

నేను నా ఆత్మను ఏడుమార్లు మోసగించాను.
The first time when I saw her being meek that she might attain height.

మొదటిసారి, అది ఉన్నతమవుతుందనుకుని మెత్తపడుతుండగా.
The second time when I saw her limping before the crippled.

రెండవసారి, అది వికలాంగుల ముందు కుంటుతుండగా.
The third time when she was given to choose between the hard and the easy, and she chose the easy.

మూడవసారి, అది కష్ట సుఖాల ఎంపికలో సులభం వేపు మొగ్గినందుకు.
The fourth time when she committed a wrong, and comforted herself that others also commit wrong.

నాలుగవసారి, అది తప్పుచేసి, అందరూ తప్పుచేసే వారేనని, సరిపుచ్చుకున్నందుకు.
The fifth time when she forbore for weakness, and attributed her patience to strength.

అయిదవసారి, అది బలహీనతకు తలవంచి, తన ఓపిక బలం వల్ల వచ్చిందన్నందుకు.
The sixth time when she despised the ugliness of a face, and knew not that it was one of her own masks.

ఆరవసారి, అది తన ముఖమేనని తెలియక ఒక వికార రూపాన్ని అసహ్యించుకున్నందుకు.
And the seventh time when she sang a song of praise, and deemed it a virtue.

ఇక ఏడవసారి, అది శ్లాఘనగీతం పాడి అదొక సద్గుణమని అనుకున్నందుకు.

I AM IGNORANT of absolute truth. But I am humble before my ignorance and therein lies my honor and my reward.
నాకు శాశ్వత సత్యం తెలియదు. కానీ నేను నా అజ్ఞానం ముందు తల వంచుతాను. అందులోనే నా గౌరవమూ, బహుమానమూ ఉన్నాయి.
There is a space between man's imagination and man's attainment that may only be traversed by his longing.

మనిషి అనుకున్నదానికీ అందుకున్నదానికీ మధ్య ఖాళీ ఉంది. ఆ ఖాళీని దాటడం కేవలం కోరికతోనే వీలవుతుంది.

Paradise is there, behind that door, in the next room; but I have lost the key.

స్వర్గం, పక్కగదిలో ఆ తలుపు ఆవల ఉంది. కానీ నేను తాళంచెవులు పడేసుకున్నాను.
Perhaps I have only mislaid it.

బహుశ పొరపాటున ఎక్కడో పెట్టినట్టున్నాను.

You are blind and I am deaf and dumb, so let us touch hands and understand.

నీవు గుడ్డి. మరి నేనేమో చెవిటి, మూగ. అందుకే మనం చేతులు కలిపి ఒకరినొకరు అర్థం చేసుకుందాం.

The significance of man is not in what he attains, but rather in what he longs to attain.

మనిషి ఏం సాధించాడన్నది ముఖ్యంకాదు. ఏం సాధించాలనుకున్నాడన్నది ముఖ్యం.

Some of us are like ink and some like paper.

మనలో కొందరం సిరాలాంటి వాళ్లం. కొందరం కాగితంలాంటి వాళ్లం.
And if it were not for the blackness of some of us, some of us would be dumb;

మనలో కొందరి ఆ నలుపే లేకుంటే కొందరు మూగవాళ్లుగా మిగిలేవారు.
And if it were not for the whiteness of some of us, some of us would be blind.

మనలో కొందరి తెల్లదనమే లేకుంటే కొందరు గుడ్డివాళ్లుగా మిగిలేవారు.

Give me an ear and I will give you a voice.

నాకొక చెవినివ్వండి. నేను మీకొక గొంతునిస్తాను.


Our mind is a sponge; our heart is a stream.

మన మెదడు స్పంజిలాంటిది. మన మనసు ప్రవాహం లాంటిది.


Is it not strange that most of us choose sucking rather than running?

మనలో చాలా మంది పాలుతాగడమేగాని పరుగెత్తడం ఇష్టపడకపోవడం చిత్రం కదూ.

When you long for blessings that you may not name, and when you grieve knowing not the cause, then

తెలియని ఆశీస్సుల కొరకు నీవు తపన పడుతున్నావంటే, ఇక కారణం తెలియకుండానే దుఖంలో మునుగుతున్నావంటే,

 indeed you are growing with all things that grow, and rising toward your greater self.
తప్పకుండా పెరిగే అన్ని సంగతులతోబాటు నీవూ పెరుగుతున్నట్లు, నీలోని ఉన్నతాత్మ ఎత్తుకు చేరుతున్నట్టు లెక్క.


When one is drunk with a vision, he deems his faint expression of it the very wine.
మహత్తరమయిన ఆలోచన మత్తులో మునిగిన వానికి, దాని గురించి చూచాయగా చెప్పడమే మదిర.


You drink wine that you may be intoxicated; and I drink that it may sober me from that other wine.

మత్తు కొరకు మదిరపుచ్చుకుంటావు. నేను మాత్రం మరో మదిర మత్తు దిగాలని తాగుతాను.

When my cup is empty I resign myself to its emptiness; but when it is half full I resent its half-fulness.
నా పానపాత్ర అడుగంటితే, ఆ ఖాళీని నేను అంగీకరిస్తాను. అది సగం నిండి ఉన్నప్పుడు మాత్రం ఆ అరకొర తనాన్ని నిరసిస్తాను.

The reality of the other person is not in what he reveals to you, but in what he cannot reveal to you.

ఎదుటి మనిషి నీకు చెప్పిన సంగతులే అతని గురించిన వాస్తవాలు కావు. అతను చెప్పలేని వాటిలో వాస్తవం దాగి ఉంది.
Therefore, if you would understand him, listen not to what he says but rather to what he does not say.
అందుకే, అతడిని అర్థం చేసుకోగలిగితే, అతను చెప్పే మాటలు వినకు. అతను చెప్పనిదేదో విను.

Half of what I say is meaningless; but I say it so that the other half may reach you.
నేను చెప్పే మాటల్లో సగం వాటికి అర్థంలేదు. అయినా చెపుతాను. కనీసం ఆ మిగతా సగం మీకందాలని.


A sense of humour is a sense of proportion.
హాస్యాన్ని అర్థం చేసుకో గలగడమంటే, అన్ని విషయాలనూ అర్థం చేసుకోగలగడమని అర్థం.


My loneliness was born when men praised my talkative faults and blamed my silent virtues.
మనుషులు నా మాటల్లో తప్పులను పొగిడి, నా మౌనంలో మంచిగుణాలను తెగడినప్పుడే నా ఒంటరితనం మొదలయింది.


When Life does not find a singer to sing her heart she produces a philosopher to speak her mind.
తన మనసును పాడే పాటగాడు దొరకకపోతే, జీవితం, తన మెదడును విప్పిచెప్పే తాత్వికుడిని తయారు చేస్తుంది.


A truth is to be known always, to be uttered sometimes.
సత్యాన్ని ఎప్పుడూ తెలుసుకుని ఉండాలి. అప్పుడప్పుడు మాత్రమే దాన్ని పలకాలి.


The real in us is silent; the acquired is talkative.
మనలోని అసలు సత్యం మౌనంగా ఉంటుంది. అరువు తెచ్చుకున్నదేదో మాట్లాడుతుంది.


The voice of life in me cannot reach the ear of life in you; but let us talk that we may not feel lonely.
నాలోని జీవం గొంతుక నీలోని జీవం చెవి దాకా చేరదు. అయినా ఒంటరితనం ఉండగూడదు గనుక మనం మాట్లాడుదాం.


When two women talk they say nothing; when one woman speaks she reveals all of life.
ఇద్దరాడవాళ్లు మాట్లాడితే అందులో ఏమీ ఉండదు. ఒక్క ఆడమనిషి మాట్లాడితే, ఆమె జీవితాన్నంతా విప్పిచెపుతుంది.


Frogs may bellow louder than bulls, but they cannot drag the plough in the field not turn the wheel of the winepress, and of their skins you cannot make shoes.
కప్పలు ఎద్దులకన్నా గట్టిగా అరవగలుగుతాయేమో, కానీ అవి, పొలంలో నాగలి లాగలేవు, గానుగ చక్రాన్ని తిప్పలేవు, వాటి చర్మంతో చెప్పులు కుట్టుకోవడమూ కుదరదు.


Only the dumb envy the talkative.
మూగవాళ్లు మాత్రమే, మాట్లాడే వాళ్లను చూచి అసూయ పడతారు.


If winter should say, "Spring is in my heart," who would believe winter?
వసంతం నా మనసులో ఉందని చలికాలం చెపితే, దాన్నెవరు నమ్ముతారు


Every seed is a longing.
ప్రతి విత్తనమూ ఒక కోరిక.


Should you really open your eyes and see, you would behold your image in all images.
And should you open your ears and listen, you would hear your own voice in all voices.
నీవు నిజంగా కళ్లువిప్పి చూడగలిగితే, అన్నింటా నీ మూర్తిని చూడగలగాలి.

ఇకనీవు చెవులు విప్పి వినగలిగితే, అన్ని గొంతుకల్లో నీ గొంతుకనే వినగలగాలి.

It takes two of us to discover truth: one to utter it and one to understand it.
సత్యం తెలుసుకోవడానికి మనం ఇద్దరమూ అవసరం. ఒకరు సత్యం పలకడానికి, మరొకరు దాన్ని అర్థం చేసుకోవడానికి.


Though the wave of words is forever upon us, yet our depth is forever silent.
మాటల తరంగాలు నిరంతరం మన మీదే ఉన్నా, మన లోతులు మాత్రం ఎప్పుడూ మౌనంగానే ఉంటాయి.


Many a doctrine is like a window pane. We see truth through it but it divides us from truth.
చాలా సిద్ధాంతాలు కిటికీ అద్దంలాంటివి. అందులోనుంచి మనం సత్యం చూడగలుగుతాం. అయినా దాన్నుంచి మనలనది వేరు చేస్తుంది.


More Coming up!