Part
7
The tribune of humanity is in its silent heart, never its talkative mind.
They
deem me mad because I will not sell my days for gold;
నేను నా సమయాన్ని
బంగారమిచ్చినా అమ్మను
గనుక నన్ను పిచ్చివాని
కింద లెక్కగట్టారు.
And I deem them mad because they think my days
have a price.
నా సమయానికి విలువ
ఉందని అనుకుంటారు గనుక
నేను వాళ్లను పిచ్చివాళ్ల
కింద లెక్కగడతాను.
They
spread before us their riches of gold and silver, of ivory and ebony,
వాళ్లు వాళ్ల
వెంజి బంగారమూ, ఏనుగు
దంతాలూ మొదలైన ఆస్తినంతా
ముందుంచుతారు.
and
we spread before them our hearts and our spirits.;
మనం వాళ్ల ముందు
మన మనసునూ, మంచితనాన్నీ
పరుస్తాము.
And yet they deem themselves the hosts and us the guests.
అయినా
వాళ్లు మనల్ని అతిథులుగా
, తమను ఇంటివాళ్లుగా అనుకుంటారు.
I
would not be the least among men with dreams and the desire to fulfill them,
కలలూ, వాటిని
నిజం చేసుకోవాలన్న కోరికా
గలవాళల్లో చివరి వాడిగా
ఉండడంకన్నా
rather
than the greatest with no dreams and no desires.
కలలూ, కోరికలూ
లేని గొప్పవాడిగా ఉండడమే
బాగుంటుంది.
The
most pitiful among men is he who turns his dreams into silver and gold.
కలలను వెండి
బంగారాలుగా మార్చుకునే
మనిషి అందరికన్నా దయనీయుడు.
We are all climbing toward the summit of our
hearts' desire.
మనసులోని కోరికలనే
కొండ కొమ్మును చేరుకునేందుకు
అందరమూ ప్ర.యాస పడుతున్నాము.
Should
the other climber steal your sack and your purse and wax fat on the one and heavy on the other,
మరొకడు నీ సంచీని,
డబ్బునూ మిగతా వస్తువులనూ
దొంగిలిస్తే,
you should pity him;
వాని మీద జాలిపడాలి.
The climbing will be harder for his flesh, and
the burden will make his way longer.
వాడికి ఎక్కడం
కష్టమవుతుంది. బరువుతో
వాని దారి మరింత దూరమవుతుంది.
And should you in your leanness see his flesh puffing
upward,
బక్క పలచని
నీవు, వాని ఉబ్బరాన్ని
చూడ గలిగితే,
help
him a step; it will add to your swiftness.
వానికింత సాయం
చెయ్యి. దాంతో నీ వేగం
పెరుగుతుంది.
You
cannot judge any man beyond your knowledge of him, and how small is your knowledge.
ఎదుటి మనిషిని
గురించి చెప్పడానికి
నీకు తెలిసిందానికంటే
ఎక్కువ చేతగాదు. అయినా,
నీకు తెలిసిందెంత
I would not listen to a conqueror preaching to the conquered.
విజేత ఓడినవారికి
ఏదయినా పెపుతుంటే నేను
వినను.
The
truly free man is he who bears the load of the bond slave patiently.
వెట్టివాని
పనిని ఓపికగా తలకెత్తుకున్న
వాడే నిజంగా స్వతంత్రమానవుడు.
A thousand years ago my neighbor said to me,
"I hate life, for it is naught but a thing of pain."
And yesterday I passed by a cemetery and saw life dancing upon his
grave.
వెయ్యేళ్ల
క్రితం మా పక్కింటాయన
అన్నాడూ, నాకు బతుకంటే
అసహ్యం, అంది బాధలు తప్ప
మరోటి కాదు అని.
నిన్న నేను
శ్మశానం పక్కగా వెళుతుంటే,
అతని సమాధి మీద జీవం నాట్యమాడడం
చూచాను.
Strife
in nature is but disorder longing for order.
పకృతిలో పోరాటమంటే,
అక్రమం క్రమంకొఱకు పడే
బాధ.
Solitude
is a silent storm that breaks down all our dead branches;
Yet it sends our living roots deeper into the living heart of
the living earth.
ఏకాంతం ఒక నిశ్శబ్దమయిన
తుఫాను. అది మనలోని ఎండు
కొమ్మలను పడగొట్టేస్తుంది.
అయినా అది మన
వేళ్లను మాత్రం గుండెలోకీ,
నేలలోకీ లోతుగా పంపుతుంది.
Once I spoke of the sea to a brook, and the
brook thought me but an imaginative exaggerator;
And once I spoke of a brook to the sea, and the sea thought me but a depreciative
defamer.
ఒకసారి నేను
సెలయేటితో సముద్రం గురించి
మాట్లాడాను. నేను అతిగా
మాట్లాడతానని సెలయేరు
అనుకున్నది.
మరి మరోసారి
నేనను సముద్రంతో సెలయేరు
గురించి చెప్పాను. నేను
మరీ తక్కపవచేసి చెపుతున్నానని
సముద్రమనుకున్నది.
How narrow is the vision that exalts the busyness
of the ant above the singing of the grasshopper.
చీమ బిజీగా
ఉండడం మిడతపాటకన్నా గొప్ప
అనుకోవడం ఎంతటి ఇరుకుదృష్టి
The highest virtue here may be
the least in another world.
ఇక్కడి ఎంతో
గొప్ప సద్గుణం మరో ప్రపంచంలో
నీచగుణం కావచ్చు.
The deep and the high go to the depth or to the height in a straight
line; only the spacious can move in circles.
లోతు ఎత్తులు
అక్కడికి చక్కని దారులలో
వెళతాయి. వైశాల్యం మాత్రం
వృత్తాలలో కదులుతుంది.
IF IT WERE not for our conception of weights
and measures we would stand in awe of the firefly as we do before the sun.
మనకు తూనికలు
కొలతల గురించి తెలిసి
ఉండకపోతే, సూర్యుని ముందులాగే
మిణుగురుపురుగు ముందు
కూడా నోరు విప్పుకుని
చూస్తూ ఉండిపోయేవారలం
A scientist without imagination is a butcher
with dull knives and out-worn scales.
But what would you, since we are not all vegetarians?
సృజనలేని పరిశోధకుడు
పదునుచెడిన కత్తులూ తప్పుడు
తక్కెడలూ గల కసాయి వంటివాడు.
అందరమూ శాకాహారులం
కాము. మంచిదయింది.
When you sing the hungry hears you with his stomach.
నీవు పాడితే
ఆకలిగొన్నవారు తమ కడుపులతో
వింటారు.
Death is not nearer to the aged than to the new-born; neither is life.
మరణం నవజాత
శిశువుకన్నా ముదుసలికి
దగ్గరేం కాదు. రెండూ జీవంలేని
దశలే.
If
indeed you must be candid, be candid beautifully; otherwise keep silent, for there is a man in our neighborhood who is dying.
ఉన్నమాట చెప్పవలసి
వస్తే అందంగా చెప్పు.
లేదంటే నోరు మూసుకు ఉండిపో.
ఎందుకంటే పొరుగున చావ
సిద్ధమయిన మనిషి ఒకతనున్నాడు
మరి.
Mayhap a
funeral among men is a wedding feast among the angels.
మనుషుల అంతిమయాత్ర
దేవదూతలకు పెళ్లివిందు
లాంటిదేమో.
A forgotten reality may die and leave in its will seven thousand actualities and facts to be spent
in its funeral and the building of a tomb.
మరచిపోయిన
వాస్తవం మరణిస్తుంది.
తన వీలునామాలో ఏడువేల
నిజాలను వదిలి పోతుంది.
అంత్యక్రియలకూ, సమాధి
కట్టడానికవి పనికొస్తాయని.
In truth we talk only to ourselves, but sometimes
we talk loud enough that others may hear us.
నిజానికి మనం
మనతోనే మాట్లాడుకుంటాము.
కానీ అప్పుడప్పుడు మరీ
గట్టిగా మాట్లాడతాము,
మందికి ఆ మాటలు వినబడతాయి.
The obvious is that which is never seen until
someone expresses it simply.
ఎవరో సులభంగా
మనకు చెప్పేదాకా అర్థంగానిదే
అసలు నిజం.
If the Milky Way were not within me how should I have seen it or known it?
పాలపుంత నాలోనే
లేకుంటే నేను దాన్ని
ఎలా చూచాను ఎలా తెలుసుకున్నాను
Unless I am a physician among physicians they
would not believe that I am an astronomer.
నేను వైద్యులకే
వైద్యుడిని కాకుంటే నన్ను
ఖగోళవేత్తగా ఎవరు గుర్తిస్తారు
Perhaps the sea's definition of a shell is
the pearl.
Perhaps time's definition of coal is the diamond.
బహుశః సముద్రం
ఆల్చిప్పను ముత్యమని
నిర్వచిస్తుంది.
బహుశ- కాలం బొగ్గును
వజ్రంగా నిర్వచిస్తుంది.
Fame is the shadow of passion standing in the
light.
వెలుతురులో
నిలిచిన ప్రేమ నీడనే
కీర్తి.
A
root is a flower that disdains fame.
కీర్తిని కాదన్న
పూలనే వేళ్లంటారు.
There is neither religion nor science beyond beauty.
అందాన్ని మించిన
మతం లేదు, శాస్త్రమంతకన్నా
లేదు.
Every
great man I have known had something small in his make-up; and it was that small something which prevented inactivity or madness
or suicide.
The
truly great man is he who would master no one, and who would be mastered by none.
ఎవరి
మీదా పెత్తనం చేయని, ఎవరి
పెత్తనానికీ లొంగని మనిషి
నిజంగా గొప్పవాడు.