Vijayagopal's Home Page

The Wanderer - Kahlil Gibran
Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

Here is another series from Kahlil Gibran! Enjoy and learn if you can!

THE WANDERER

I met him at the crossroads, a man with but a cloak and a staff, and a veil of pain upon his face. And we greeted one another, and I said to him, “Come to my house and be my guest.”

And he came.

My wife and my children met us at the threshold, and he smiled at them, and they loved his coming.

Then we all sat together at the board and we were happy with the man for there was a silence and a mystery in him.


And after supper we gathered to the fire and I asked him about his wanderings.


He told us many a tale that night and also the next day, but what I now record was born out of the bitterness of his days though he himself was kindly, and these tales are of the dust and patience of his road.


And when he left us after three days we did not feel that a guest had departed but rather that one of us was still out in the garden and had not yet come in.

 

వాండరర్

 

ఒక దుప్పటీ, చేతికర్రా మాత్రమే ఉన్న ఆ మనిషిని నేను నాలుగు దారులు కలిసేచోట కలిసాను. ఒకరికొకరం నమస్కారం చేసుకున్నాము. మా యింటికి రండి. ఆతిథ్యం స్వీకరించండి అన్నాను నేను.

అతను వచ్చాడు.

నా భార్యా పిల్లలు ఇంటి ముందే కనిపించారు. అతను వారిని చూచి చిరునవ్వాడు. అతను రావడం వాళ్లందరికీ భాగనిపించింది.

అంతా కలిసి బల్ల ముందు కూచున్నాము. మాకందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే అతనిలో నిశ్శబ్దం, రహస్యమయతత్వం ఉన్నాయి మరి.

భోజనం తర్వాత అందరమూ నెగడు ముందు చేరాము. నేనతడిని తన ప్రయాణాల గురించి అడిగాను.

 

అతను ఆ రాత్రీ, మరురోజూ మాకెన్నో కథలు చెప్పాడు. అతని బతుకులోని చేదుతనం వల్ల నాకిప్పుడీ భావం కలిగింది. అతను మాత్రం దయగల మనిషే. ఆ కథలన్నీ  అతని దారిలోని దుమ్మూ, ఓపికలేనని నాకనిపిస్తుంది.

 

మూడురోజుల తర్వాత అతను వెళ్లిపోయాడు. బంధువెవరో వెళ్లిపోయినట్టు అనిపించలేదు మాకు. మాలోని ఒక మనిషి బయట తోటలో ఉన్నాడు, ఇంకా లోనికి రాలేదు అన్నట్లుంది.


GARMENTS

Upon a day Beauty and Ugliness met on the shore of a sea. And they said to one another, “Let us bathe in the sea.”


Then they disrobed and swam in the waters. And after a while Ugliness came back to shore and garmented himself with the garments of Beauty and walked away.


And Beauty too came out of the sea, and found not her raiment, and she was too shy to be naked, therefore she dressed herself with the raiment of Ugliness. And Beauty walked her way.


And to this very day men and women mistake the one for the other.


Yet some there are who have beheld the face of Beauty, and they know her notwithstanding her garments. And some there be who know the face of Ugliness, and the cloth conceals him not from their eyes.

 

దుస్తులు

ఒకరోజున అందం, అనాకారితనం సముద్రపు ఒడ్డున కలిశాయి. సముద్రంలో స్నానం చేద్దాం అని అనుకున్నాయి.
అప్పుడిక గుడ్డలు వదిలి నీటిలో ఈదులాడాయి. కొంతసేపు తర్వాత అనాకారితనం ఒడ్డుకు వచ్చేసింది. అందం దుస్తులను తాను వేసుకుని వెళ్లిపోయింది.

అందంకూడా సముద్రంలోనుంచి బయటకు వచ్చింది. ఆమె దుస్తులు కనిపించలేదు. గుడ్డలులేకుండా ఉండడానికి సిగ్గుపడింది. అందుకే, అనాకారి బట్టలను తాను వేసుకున్నది. అలా, ఇక అందం తనదారిన పోయింది.

అందుకే ఇవాళటికీ, ఆడా మగా అందరూ, వాళ్లిద్దరినీ సరిగా గుర్తించలేక పోతున్నారు.

అందం ముఖం చూచి, వేసుకున్న గుడ్డలు ఎట్లున్నా ఆమెను గుర్తించే వారు కొందరున్నారు. కొందరికి అనాకారి ముఖం తెలుసు. ఆ అందమయిన దుస్తులు వాళ్ల కళ్లను మోసగించజాలవు.

 

 

 

 

 

 

 


THE EAGLE AND THE SKYLARK

 

A skylark and an eagle met on a rock upon a high hill. The skylark said, “Good morrow to you, Sir.” And the eagle looked down upon him and said faintly, “Good morrow.”

And the skylark said, “I hope all things are well with you, Sir.”

 

“Aye,” said the eagle, “all is well with us. But do you not know that we are the king of birds, and that you shall not address us before we ourselves have spoken?”

Said the skylark, “Methinks we are of the same family.”


The eagle looked upon him with disdain and he said, “Who ever has said that you and I are of the same family?”


Then said the skylark, “But I would remind you of this, I can fly even as high as you, and I can sing and give delight to the other creatures of this earth. And you give neither pleasure nor delight.”


Then the eagle was angered, and he said, “Pleasure and delight! You little presumptuous creature! With one thrust of my beak I could destroy you. You are but the size of my foot.”


Then the skylark flew up and alighted upon the back of the eagle and began to pick at his feathers. The eagle was annoyed, and he flew swift and high that he might rid himself of the little bird. But he failed to do so. At last he dropped back to that very rock upon the high hill, more fretted than ever, with the little creature still upon his back, and cursing the fate of the hour.

 

Now at that moment a small turtle came by and laughed at the sight, and laughed so hard the she almost turned upon her back.


And the eagle looked down upon the turtle and he said, “You slow creeping thing, ever one with the earth, what are you laughing at?”


And the turtle said, “Why I see that you are turned horse, and that you have a small bird riding you, but the small bird is the better bird.”


And the eagle said to her, “Go you about your business. This is a family affair between my brother, the lark, and myself.”

 

గరుడపక్షీ, భరతపక్షి

 

భరతపక్షీ, గరుడపక్షీ ఒక పెద్ద కొండమీద ఒక బండ మీద కలుసుకున్నాయి. అయ్యా నమస్కారం!’ అన్నది భరతపక్షి. గరుడ పక్షి నిర్లక్ష్యంగా చూచి, నమస్కారం అని గొణిగింది.

అంతా కుశలమే అనుకుంటాను!’ అన్నది భరతపక్షి.

 

అన్నది గరుడపక్షి. అంతా బాగానే ఉన్నాం. అయినా నీకు, మేము పక్షులకు రాజులమని తెలియదా మేం మాట్లాడక ముందే నీవు పలకరించడం తప్పుగాదా?’ అన్నది.

మనమంతా ఒకే కుటుంబమని నేననుకుంటున్నాను!’ అన్నది భరతపక్షి

 

గరుడపక్షి కోపంగా చూచింది. నీవూ, నేనూ ఒకే కుటుంబమని ఎవరు చెప్పారేమిటి?’ అన్నది.

 

కానీ, నేనొకటి గుర్తు చేస్తాను. నేనూ మీరెగిరే ఎత్తులకు ఎగరగలను. నేనింకా, పాడి ఈ భూమి మీది ఇతర ప్రాణులకు సంతోషం కలిగించగలను. మీ వల్ల సంతోషమూ లేదు, సంతృప్తీ లేదు!’ అన్నది భరతపక్షి.

 

గరుడపక్షికి కోపం వచ్చింది. సంతోషమూ సంతృప్తీ. కుర్రకుంకా, ఒక్కసారి ముక్కు విసిరానంటే ముక్కలవుతావు. నా కాలంతలేవు!’ అన్నదది.


అప్పుడు భరతపక్షి ఎగిరి గరుడపక్షి వీపు మీద కూచున్నది. ముక్కుతో రెక్కలను పీకసాగింది. గరుడపక్షికి కోపం వచ్చింది. చిన్న పక్షిని కిందపడవేయాలని, చాలా వేగంగా ఎత్తులకు ఎగరసాగింది. కానీ కుదరలేదు. మళ్లీ తిరిగి అదే రాతి మీదికి వచ్చి దిగింది. భరతపక్షి ఇంకా దాని వీపు మీదనే ఉంది. గరుడపక్షికి కోపం పెరిగి తన అదృష్టాన్ని నిందించసాగింది.


ఇక, అప్పుడొక తాబేలు అటుగా వచ్చి, సంగతి చూచి నవ్వసాగింది. మరీ నవ్వి నవ్వి తలకిందులుగా పడిపోయింది.

 

గరుడపక్షి నిర్లక్ష్యంగా చూచి, పాకుడు వెధవా, నేలను వదిలి కదలలేవు.  ఏంచూచి నవ్వుతున్నావు?’ అన్నది.

 

ఏం, నీవేమో గుఱ్ఱానివయ్యావు. ఆ చిన్న పిట్ట నీ మీద ఎక్కి స్వారీ చేస్తున్నది. నీకన్నా అదే గొప్ప పక్షి!’ అన్నది తాబేలు.

నీ పని నీవు చూచుకో. ఇది కుటుంబ వ్యవహారం. నేనూ, నా తమ్ముడు భరతపక్షి మధ్య వ్యవహారం!’ అన్నది గరుడపక్షి.

 

 

 


THE LOVE SONG

A poet once wrote a love song and it was beautiful. And he made many copies of it, and sent them to his friends and his acquaintances, both men and women, and even to a young woman whom he had met but once, who lived beyond the mountains.

And in a day or two a messenger came from the young woman bringing a letter. And in the letter she said, “Let me assure you, I am deeply touched by the love song that you have written to me. Come now, and see my father and my mother, and we shall make arrangements for the betrothal.”


And the poet answered the letter, and he said to her, “My friend, it was but a song of love out of a poet’s heart, sung by every man to every woman.”


And she wrote again to him saying, “Hypocrite and liar in words! From this day unto my coffin-day I shall hate all poets for your sake.”

 

ప్రేమపాట

 

కవి ఒక ప్రణయగీతం రాశాడు. అది చాలా బాగుంది. కవి దాని నకళ్లు తీసి, మిత్రులకూ, తెలిసినవాళ్లకూ, ఆడా మగా అందరికీ పంపించాడు. కొండలకావల ఉండే ఒక అమ్మాయికి కూడా. ఆమెనతడు ఒకేసారి కలిసాడు అంతకు ముందు.

ఇక, ఒకటి రెండు రోజుల్లోనే, ఆ అమ్మాయి ఉత్తరం తీసుకుని ఒక దూత వచ్చాడు. నీవు నాకు రాసిన ప్రేమగీతం నాలోని లోతులను తాకింది. నీవు వచ్చి, నా అమ్మా నాన్నలను కలువు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుందాం!; అని రాసి ఉంది ఆ ఉత్తరంలో.

కవి ఆ ఉత్తరానికి జవాబు రాశాడు. అందులో ఆమెతో, నా మిత్రమా అది కవి మనసులో పుట్టిన ప్రేమపాటమాత్రమే. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీతో పాడే పాట!’ అది అని రాశాడు.

ఆమె మళ్లీ జవాబు రాసింది. మనసు విప్పని అబద్ధాల పుట్టా ఈనాటినుంచి నేను పోయేరోజు దాకా అందరు కవులనూ అసహ్యించుకుంటాను. అదీ నీకారణంగా!’ అని


TEARS AND LAUGHTER

Upon the bank of the Nile at eventide, a hyena met a crocodile and they stopped and greeted one another.

 

The hyena spoke and said, “How goes the day with you, Sir?”


And the crocodile answered saying, “It goes badly with me. Sometimes in my pain and sorrow I weep, and then the creatures always say, ‘They are but crocodile tears.’ And this wounds me beyond all telling.”


Then the hyena said, “You speak of your pain and your sorrow, but think of me also, for a moment. I gaze at the beauty of the world, its wonders and its miracles, and out of sheer joy I laugh even as the day laughs. And then the people of the jungle say, ‘It is but the laughter of a hyena.’ ”

 

కన్నీళ్లూ, నవ్వూ


నైలు ఒడ్డున అలలు అంతగా లేని దినాన ఒక దుమ్ములగొండి ఒక మెసలిని కలిసింది. అవి ఆగి నమస్కారాలు చేసుకున్నాయి.

అయ్యా ఎలా జరుగుతున్నాయి రోజులు?’ అన్నది  దుమ్ములగొండి.

ఏం బాగుండలేదు. ఒకోసారి బాధా, దుఃఖం కొద్దీ ఏడుస్తాను. కానీ ఆ ప్రాణులేమో, ఆ మొసలి కన్నీళ్లు అంటాయి! చెప్పలేనంత బాధ కలుగుతుంది!’ అన్నది మొసలి.

ఇక దుమ్ములగొండి చెప్పసాగింది. నీవు నీ బాధా, దుఃఖం గురించి చెపుతున్నావు. ఒక క్షణం నాగురించి కూడా ఆలోచించు. నేను ఈ ప్రపంచం అందాన్ని చూస్తాను. వింతలనూ, విశేషాలను చూస్తాను. పట్టలేని ఆనందంతో, నవ్వుతాను, దినంలాగే. అడవిలోని మనుషులు మాత్రం అది దుమ్ములగొండి నవ్వు!’ అంటారు.

(దుమ్ములగొండి నవ్వు గురించి మన దేశంలో అంతగా ప్రచారంలో లేదు,)


AT THE FAIR

There came to the Fair a girl from the country-side, most comely. There was a lily and a rose in her face. There was a sunset in her hair, and dawn smiled upon her lips.


No sooner did the lovely stranger appear in their sight than the young men sought her and surrounded her. One would dance with her, and another would cut a cake in her honour. And they all desired to kiss her cheek. For after all, was it not the Fair?


But the girl was shocked and started, and she thought ill of the young men. She rebuked them, and she even struck one or two of them in the face. Then she ran away from them.



And on her way home that evening she was saying in her heart, “I am disgusted. How unmannerly and ill bred are these men. It is beyond all patience.”


A year passed during which that very comely girl thought much of Fairs and men. Then she came again to the Fair with the lily and the rose in her face, the sunset in her hair and the smile of dawn upon her lips.


But now the young men, seeing her, turned from her. And all the daylong she was unsought and alone.


And at eventide as she walked the road toward her home she cried in her heart, “I am disgusted. How unmannerly and ill bred are these youths. It is beyond all patience.”

సంతలో

సంతకు పల్లె ప్రాంతం నుంచి ఒక అందమయిన అమ్మాయి వచ్చింది. ఆమె ముఖంలో పువ్వులు విరిసి ఉన్నాయి. ఆమె కురులలో సూర్యాస్తమయం ఉంది. ఆమె పెదవుల మీద సూర్యోదయం చిరునవ్వింది.

ఆ అందమయిన కొత్త అమ్మాయి కనిపించిన మరుక్షణం, కుర్రవాళ్లందరూ ఆమెను కోరి చుట్టుముట్టారు. ఒకడామెతో నాట్యమాడతాడు. మరొకడు ఆమె గౌరవార్థం విందుచేస్తాడు. అందరూ ఆమె చెక్కిలి ముద్దాడాలనుకున్న వాళ్లే. ఎంత చేసినా సంతగదా మరి

కానీ అమ్మాయి మాత్రం అదిరింది. భయపడింది. అందరి గురించీ చెడ్డగా భావించింది. వాళ్లను చిట్టి పోసింది. ఒకరిద్దరినయితే ముఖం మీద కొట్టింది కూడా. తరువాత అక్కడినుంచి పారిపోయింది.
సాయంత్రం ఇంటికి వెళుతూ దారిలో, తనలో తాను అనుకుంది, అసహ్యం ఎంత మర్యాద తెలి.ని మనుషులు, భరించలేము!’ అని
ఒక ఏడు గడిచింది. ఆ అమ్మాయి మాత్రం సంతలూ జాతరల మగాళ్లను గురించి ఆలోచిస్తూనే ఉంది. మళ్లీ ముఖంలో పువ్వులూ, సిగలో సాయంత్రం, పెదవుల మీద ఉదయంతో ఆమె జాతరకు వచ్చింది.
ఇప్పుడు మాత్రం కుర్రవాళ్లు, ఆమెను చూచి అంత దూరం పోయారు. దినమంతా ఆమెను అడిగినవాళ్లు లేరు. ఒంటరిగా గడిపింది.
సాయంత్రం ఇంటి దారిని నడుస్తూ, ఆమె తనలో తాను కుమిలింది. అసహ్యం ఎంత మర్యాద తెలియని మనుషులు, భరించలేము!’ అనుకుంది.


THE TWO PRINCESSES

In the city of Shawakis lived a prince, and he was loved by everyone, men and women and children. Even the animals of the field came unto him in greeting.


But all the people said that his wife, the princess, loved him not; nay, that she even hated him.


And upon a day the princess of a neighbouring city came to visit the princess of Shawakis. And they sat and talked together, and their words led to their husbands.


And the princess of Sharakis said with passion, “I envy you your happiness with the prince, your husband, though you have been married these many years. I hate my husband. He belongs not to me alone, and I am indeed a woman most unhappy.”

 

Then the visiting princess gazed at her and said, “My friend, the truth is that you love your husband. Aye, and you still have him for a passion unspent, and that is life in woman like unto Spring in a garden. But pity me, and my husband, for we do but endure one another in silent patience. And yet you and others deem this happiness.”

 

ఇద్దరు రాకుమార్తెలు

 

షవాకిస్ నగరంలో ఒక రాకుమారుడు ఉండేవాడు. ఆడా, మగా, పెద్దా, పిన్నా అందరికీ అతనంటే ఇష్టం. చివరకు పొలాల్లో జంతువులు కూడా అతడిని పలకరించడానికి వచ్చేవి.
అయితే అతని భార్య అంటే యువరాణికి మాత్రం అతనంటే ప్రేమ లేదని అందరూ అనేవారు. పైగా ఆమెకు అతనంటే అసహ్యమట.
ఒకనాడు పొరుగూరి యువరాణి షవాకిస్ యువరాణిను చూడవచ్చింది. వాళ్లద్దరూ కూచుని ముచ్చట్లాడారు. మాటలు భర్తల గురించి దాకా వెళ్లాయి.
షవాకిస్ యువరాణి ఎంతో ప్రేమతో, నీ భర్తతో నీ ఆనందాన్ని చూస్తే నాకు అసూయ కలుగుతుంది. పెళ్లయి ఇన్నేళ్లయినా మీరిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు! నాకు మా వారంటే అసహ్యం. ఆయన నాకొక్కతెకే స్వంతం గాదు. నేను నిజానికి ఎంతో అసంతోషం గల దాన్ని!’ అన్నది.
చూడవచ్చిన యువరాణి తేరిపార జూచి, మిత్రమా, నిజమేమంటే, నీకు నీ భర్తంటే ఎంతో యిష్టం. ఆయన మీద నీకింకా ప్రేమ తగ్గలేదు. ఆడమనిషి, బతుకంటే అడుగంటని బావిలాంటిది. నా సంగతి చూడు. నేనూ, నా భర్తా నిశ్సబ్దంగా ఒకరినొకరు భరిస్తున్నాము. మీరేమో దాన్ని ప్రేమ అనుకుంటున్నారు!’ అన్నది.

 


 

 

 

 

THE LIGHTNING FLASH

 

There was a Christian bishop in his cathedral on a stormy day, and an un-Christian woman came and stood before him, and she said, “I am not a Christian. Is there salvation for me from hell-fire?”


And the bishop looked upon the woman, and he answered her saying, “Nay, there is salvation for those only who are baptized of water and of the spirit.”


And even as he spoke a bolt from the sky fell with thunder upon the cathedral and it was filled with fire. And the men of the city came running, and they saved the woman, but the bishop was consumed, food of the fire.

 

మెరుపు

 

ఒక ఉరుములు మెరుపుల దినాన ఒక క్రిష్టియన్ మతాచార్యుడు కతీడ్రలులో ఉన్నాడు. మతంలో నమ్మకంలేని మహిళ ఒకర్తె వచ్చి అతని ముందు నిలిచింది. నేను క్రిష్టియనును కాను.  మరి నాకు నరక జ్వాలల నుంచి విముక్తి కలుగుతుందా?’ అని అడిగింది.

బిషప్ ఆమెను చూచాడు. లేదు. బాప్తిజము పుచ్చుకున్న వారికి మాత్రమే విముక్తి!’ అన్నాడాయన.

అతనలే మాట్లాడుతుండగానే, చర్చి మీద పిడుగు విరుచుకు పడింది. అది అగ్గిగా మండింది. నగరంలోని వారంతా పరుగున వచ్చారు. ఆ స్త్రీని కాపాడ గలిగారు. బిషప్ మాత్రం మంటలలో మాడిపోయాడు.


THE HERMIT AND THE BEASTS

Once there lived among the green hills a hermit. He was pure of spirit and white of heart. And all the animals of the land and all the fowls of the air came to him in pairs and he spoke unto them. They heard him gladly, and they would gather near unto him, and would not go until nightfall, when he would send them away, entrusting them to the wind and the woods with his blessing.


Upon an evening as he was speaking of love, a leopard raised her head and said to the hermit, “You speak to us of loving. Tell us, Sir, where is your mate?”


And the hermit said, “I have no mate.”



Then a great cry of surprise rose from the company of beasts and fowls, and they began to say among themselves, “How can he tell us of loving and mating when he himself knows naught thereof?” And quietly and in distain they left him alone.

 

That night the hermit lay upon his mat with his face earthward, and he wept bitterly and beat his hands upon his breast.

తాపసి - మృగాలు

 

పచ్చని కొండలలో ఒకప్పుడొక తాపసి ఉండేవాడు. అతను పరిశుద్ధ మానసుడు. భూమి మీది జంతువులన్నీ, ఆకాశంలో పక్షులన్నీ జంటలుగా ఆయన వద్దకు వచ్చేవి. ఆయన వాటితో మాట్లాడేవాడు. అవి ఆయనను ఆనందంగా వినేవి, దగ్గరగా వచ్చేవి, రాత్రయినా వెళ్లేవి కాదు. అప్పుడాయన వాటిని గాలికీ, అడవికీ అప్పగించి ఆశీర్వాదాలతో పంపించేవాడు.
ఒక సాయంత్రం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతుంటే, ఒక చిరుత తన తల ఎత్తి, తాపసితో, మాకు ప్రేమ గురించి చెపుతున్నారు. మరి మీ జోడు ఏదీ?’ అని అడిగింది.  
తాపసి, నాకు తోడు తేదు!’ అన్నాడు.

జంతువులూ మృగాలు అన్నీ విస్తు పోయినయి.

తనకు ప్రేమంటే ఏమిటో తెలియకుండా ఈయన మనకెట్లా చెప్పగలుగుతా?’ అని ప్రశ్నించుకున్నాయి. అవన్నీ అసంతృప్తిగా తమ దారిని పోయాయి.
ఆ రాత్రి తాపసి తన చాప మీద నేలకు ముఖం చేసి పడుకున్నాడు. అతను చాలా దీనంగా ఏడ్చాడు. గుండెలు బాదుకున్నాడు.

 


THE PROPHET AND THE CHILD

Once on a day the prophet Sharia met a child in a garden. The child ran to him and said, “Good morrow to you, Sir,” and the prophet said, “Good morrow to you, Sir.” And in a moment, “I see that you are alone.”
Then the child said, in laughter and delight, “It took a long time to lose my nurse. She thinks I am behind those hedges; but can’t you see that I am here?” Then he gazed at the prophet’s face and spoke again. “You are alone, too. What did you do with your nurse?”


The prophet answered and said, “Ah, that is a different thing. In very truth I cannot lose her oftentime. But now, when I came into this garden, she was seeking after me behind the hedges.”

The child clapped his hands and cried out, “So you are like me! Isn’t it good to be lost?” And then he said, “Who are you?”



And the man answered, “They call me the prophet Sharia. And tell me, who are you?”



“I am only myself,” said the child, “and my nurse is seeking after me, and she does not know where I am.”

Then the prophet gazed into space saying, “I too have escaped my nurse for awhile, but she will find me out.”



And the child said, “I know mine will find me out too.”



At that moment a woman’s voice was heard calling the child’s name, “See,” said the child, “I told you she would be finding me.”


And at the same moment another voice was heard, “Where art thou, Sharia?”



And the prophet said, “See my child, they have found me also.”


And turning his face upward, Sharia answered, “Here I am.”

 

ప్రవక్త - బాలుడు

 

ఒకరోజున ప్రవక్త షారియా తోటలో ఒక శిశువును కలిశారు. ఆ బాబు ప్రవక్త వద్దకు పరుగున వచ్చి నమస్కారమండీ అన్నాడు. నమస్కారమండీ!’ అన్నారు ప్రవక్త. ఒక క్షణం తర్వాత ఒంటరిగా ఉన్నట్టున్నారు?’ అన్నారాయన.
బాబు నవ్వుతూ ఆనందంగా జవాబిచ్చాడు. మా నర్సును వదిలించుకోవడానికి చాలా కాలం పట్టింది. నేనింకా ఆ పొదల వెనకాల ఉన్నానని ఆమె అనుకుంటున్నది. కానీ నేను ఇక్కడ ఉన్నానని మీరు చూడలేదూ? అలా!’ అని, ప్రవక్త ముఖాన్ని ఒకసారి చూచి మళ్లీ, మీరూ ఒంటరిగానే ఉన్నారు. మీ నర్సును ఏంచేశారు?’ అని అడిగాడు.
ఆ అది వేరే విషయం. నిజానికి ఆమెను తప్పించుకోవడం మామూలుగా వీలుకాదు. కానీ ఇప్పుడు ఈ తోటకు వచ్చినప్పుడు, అమె నన్ను ఆ పొదల వెనకాల వెదుకుతూ ఉంది!’ అని బదులిచ్చారాయన.

బాబు చప్పట్లు చరుస్తూ గట్టిగా మీరూ నా లాంటి వారే. తప్పిపోయి తిరుగుతుంటే బాగుంటుంది కదూ?’

అని ఇంతకూ మీరెవరు?’ అని అడిగాడు బాబు.

నన్ను ప్రవక్త షారియా అంటారు. మరి మీరెవరు చెప్పండి అన్నారాయన.

నేనంటే నేనే, నర్సు నన్ను వెదుకుతున్నది. ఆమెకు నేనెక్కడున్నానో తెలియదు అన్నాడు బాబు.

నేనూ కాసేపు నా నర్సు నుంచి తప్పించుకున్నాను, కానీ ఆమె నన్ను కనుగొంటుంది!’ అన్నారు ప్రవక్త.

నానర్సు కూడా నన్ను కనుగొంటుందని నాకూ తెలుసు!’ అన్నాడు బాబు.

అంతలోనే బాబు పేరును గట్టిగా పిలుస్తూ ఒక గొంతు వినిపించింది.

చూచారా నేను చెప్పినంతా అయ్యింది!’అన్నాడు బాబు.
షారియా! ఎక్కడున్నావూ?’ అంటూ అప్పుడే మరో గొంతు వినిపించింది.

చూచావా బాబూ! నన్ను కూడా పట్టేశారు!’ అన్నారు ప్రవక్త.
ఆకాశం వేపు చూస్తూ, ఇదుగో ఇక్కడున్నాను!’ అని జవాబిచ్చారాయన.

 


THE PEARL

Said one oyster to a neighbouring oyster, “I have a very great pain within me. It is heavy and round and I am in distress.”

And the other oyster replied with haughty complacence, “Praise be to the heavens and to the sea, I have no pain within me. I am well and whole both within and without.”


At that moment a crab was passing by and heard the two oysters, and he said to the one who was well and whole both within and without, “Yes, you are well and whole; but the pain that your neighbour bears is a pearl of exceeding beauty.”

ముత్యం

ఒక ముత్యపు చిప్ప పక్కనున్న మరో ముత్యపు చిప్పతో నాలోపల ఒక పెద్ద బాధ చేరుకున్నది. అది బరువుగా గుండ్రంగా ఉంది. నాకది భరించరాకుండా ఉంది!’ అన్నది.

స్వర్గమూ సముద్రాల దయ, నా లోపల ఎటువంటి బాధా లేదు. నేను లోపలా బయటా సంపూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను!’ అన్నది ఆ మరో ముత్యపు చిప్ప.


ఆ సమయంలో ఆక్కడినుంచి పోతున్న ఎండ్రకాయ ఈ మాటలు విన్నది. అది, లోపలా బయటా సంపూర్తిగా ఆరోగ్యంగా ఉన్న చిప్పతో, నీవు సంపూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవు నిజమే, కానీ, నీ పక్కనున్న చిప్పభరిస్తున్న బాధ అంతులేని అందం గల ఒక ముత్యం తెలుసా?’ అన్నది.

There is more in the offing!