BODY AND SOUL
శరీరం - ఆత్మ
A man and a woman sat by a window that opened upon Spring. They sat close one unto the
other. And the woman said, “I love you. You are handsome, and you are rich, and you are always well-attired.”
ఒక స్త్రీ
మరొక పురుషుడు కిటికీ
పక్కన కూర్చుని బయటి
వసంతాన్ని చూస్తున్నారు.
వాళ్లు ఒకరినొకరు తగులుతూ
కూచున్నారు. అప్పుడా
అమ్మాయి అన్నది, “నాకు నీవంటే
ప్రేమ! నీవెంతో అందగానివి.
ధనవంతునివి కూడా! ఎప్పుడూ మంచి
దుస్తులు వేసుకుంటావు!”, అని.
And the man said, “I
love you. You are a beautiful thought, a thing too apart to hold in the hand, and a song in my dreaming.”
ఇక అబ్బాయి
అన్నాడూ, “నాకూ నీవంటే
ప్రేమ. నీవొక అందమయిన
ఆలోచనవు. నా చేతులకబ్బని
వస్తువువు. నా కలలో పాటవు!”, అని.
But the woman turned from him
in anger, and she said, “Sir, please leave me now. I am not a thought, and I am not a thing that passes in your dreams.
I am a woman. I would have you desire me, a wife, and the mother of unborn children.” అమ్మాయి
మాత్రం కోపంగా అతని వేపు
తిరిగి, “బాబూ, యిక నన్నొదిలెయ్! నేను
ఆలోచనను కాదు. నేను నీ
కలల్లో వచ్చే వస్తువునూ
కాదు. నేను ఒక ఆడమనిషిని.
నీవు నన్ను భార్యగా, పుట్టబోయే
పిల్లలకు తల్లిగా కోరుకోవాలనుకుంటాను!”, అన్నది. And they parted. వాళ్లిద్దరూ విడిపోయారు. And the man was saying in his
heart, “Behold another dream is even now turned into mist.”
“చూస్తుండగా
మరోకల మంచులా విడిపోయింది
చూడూ!”
అనుకున్నాడు అబ్బాయి
మనసులో.
And the woman was saying, “Well, what of a man who turns me into a mist and a dream?”
“నన్ను మంచులా,
కలలా ఊహించుకుంటాడట,
ఇతనేమి మనిషి?” అనుకున్నది
అమ్మాయి.
UPON THE SAND
ఇసుక మీద
Said one man to another, “At the high tide of the sea, long ago,
with the point of my staff I wrote a line upon the sand; and the people still pause to read it, and they are careful that
naught shall erase it.”
“సముద్రం పోటెత్తినప్పుడు
చాలాకాలం క్రితం, నా చేతికర్ర
చివరతో, ఇసుకమీద ఒక గీతగీశాను.
జనం ఈనాటికీ, నిలిచి దాన్ని
చదువుతున్నారు. అది చెరిగిపోకుండా
జాగ్రత్త పడుతున్నారు!”, అన్నాడొకాయన.
And the other man said,
“And I to wrote a line upon the sand, but it was at low tide, and the waves of the vast sea washed it away. But tell
me, what did you write?”
“మరి నేనూ ఒక
గీత రాశాను. కానీ అప్పుడు
సముద్రం ఆటులో ఉంది. మహాసముద్రం
అలలు, నా రాతను తుడిపేశాయి.
ఇంతకూ చెప్పు, నీవేం రాశావూ!”, అన్నాడు
మరొకతను.
And the first man answered and said, “I wrote this: ‘I am he who is.’
But what did you write?”
మొదటి
మనిషి బదులిస్తూ, “ఎవరయితే
ఉన్నడో వానినే నేను! అని
రాశాను. మరి నీవేమి రాశావూ?” అన్నాడు.
And the other man said,
“This I wrote: ‘I am but a drop of this great ocean.’ ”
మరో అతనన్నాడూ,
“నేను
కేవలం సముద్రంలోని ఒకానొక
నీటిబొట్టును మాత్రమే
అని రాశానూ!”, అని.
THE THREE GIFTS
మూడు బహుమతులు
Once in the city of Becharre there lived a gracious prince who was loved
and honored by all his subjects.
ఒకప్పుడు
బెఖారే నగరంలో ఒక మంచి
రాజకుమారుడుండేవాడు.
ఆయనను అందరూ గౌరవించే
వారు.
But there was one exceedingly poor man who was bitter against the prince, and who wagged continually
a pestilent tongue in his dispraise. కానీ ఒక్క
మరీ పేదవాడైన మనిషి మాత్రం
రాజకుమారునికి వ్యతిరేకి.
అతనెప్పుడూ ఆయన గురించి
తప్పుడు మాటలు అంటూనే
ఉండేవాడు. The prince knew this, yet he was patient. యువరాజుకది తెలిసింది.
అయినా ఓపికగా ఉన్నాడు. But at last he bethought him; and
upon a wintry night there came to the door of the man a servant of the prince, bearing a sack of flour, a bag of soap and
a cone of sugar. కానీ చివరకు ఆయన
ఒక లోచన చేశాడు. మరి ఒకానొక
చలిరాత్రిన ఆ మనిషి ఇంటి
ముందుకు యువరాజు బంటు
ఒకడు, ఒక పిండి బస్తా, ఒక
సబ్బుపొట్లం, చక్కెరా
మోసుకుని వచ్చాడు. And the servant said “The prince
sends you these gifts in token of remembrance.” “యువరాజు
నీకు కృతజ్ఞతగా ఈ బహుమానాలు
పంపించారు!” అన్నాడు మరి
ఆ బంటు. The man was elated, for he thought the gifts were an homage from the prince. And in his pride
we went to the bishop and told him what the prince had done, saying, “Can you not see how the prince desires my goodwill?”
ఆ మనిషి యువరాజు నుంచి
బహుమతులు వచ్చినందుకు
ఉప్పొంగి పోయాడు. మతాచార్యుని
వద్దకు వెళ్లి గర్వంగా,
ఆ విషయమే చెప్పాడు. “యువరాజు
నా అభిమానం కోసం ఎంత తపిస్తున్నాడో! చూడలేవా?” అన్నాడు.
But the bishop said, “Oh, how wise a prince, and how little you
understand. He speaks in symbols. The flour is for your empty stomach; the soap is for your dirty hide; and the sugar is to
sweeten your bitter tongue.”
కానీ మతాచార్యుడు
మాత్రం, “యువరాజు ఎంత తెలివి
గలవాడో నీవంత మూర్ఖునివి! ఆయన
సంకేతభాషలో మాట్లాడాడు.
పిండి నీ మండే కడుపు కోసం! సబ్బు
నీ మురికి శరీరం కోసం! చక్కెర
నీ మాటలను తీపి చేయడం
కోసం!”
అన్నాడు.
From that day forward the man became shy even of himself. His hatred of the prince was
greater than ever, and even more he hated the bishop who had revealed the prince unto him.
ఆ రోజునుంచి
ఆ మానవుడు తనంటే తానే
సిగ్గు పడసాగాడు. యువరాజు
పట్ల అతని ఏవగింపు ఎన్నడూ
లేనంత పెరిగింది. ఆయన
మనసును తనకు విప్పి చెప్పిన
మతాచార్యుని పట్లకూడా
ఏవగింపు పెరిగింది.
But thereafter he kept
silent.
కానీ అతను
మాటలు మానాడు.
PEACE AND WAR
Three dogs were basking in the sun and conversing. The first dog said
dreamily, “It is indeed wondrous to be living in this day of dogdom. Consider the ease with which we travel under the
sea, upon the earth and even in the sky. And meditate for a moment upon the inventions brought forth for the comfort of dogs,
even for our eyes and ears and noses.”
మూడు కుక్కలు
ఎండకాగుతూ మాట్లాడుకుంటున్నాయి.
మొదటి కుక్క కలగంటున్న
తీరుగా అన్నదీ, “ఈ కుక్క ప్రపంచంలో
ఈరోజుల్లో బతకడం ఎంతో
అదృష్టం! మనం సముద్రంలోపల
ఎంత సులభంగా ఈదగలుగుతున్నామో
చూడండి. అటు నేల మీదా ఇటు
ఆకాశంలోనూ తిరగ గలుగుతున్నాము.
ఇక కుక్కల సౌకర్యాల కోసం
వచ్చిన కొత్త విషయాల
గురించి ఒక్క క్షణం ఆలోచించి
చూడండి. మన కళ్లకూ ముక్కులకూ
చెవులకూ అన్నింటికీ!”, అని.
And the second dog spoke
and he said, “We are more heedful of the arts. We bark at the moon more rhythmically than did our forefathers. And when
we gaze at ourselves in the water we see that our features are clearer than the features of yesterday.”
ఇక రెండవ
కుక్క అందుకుని “మనం కళలను
గురించి కూడా పట్టించుకుంటున్నాము.
మనం చందురుడిని చూచి
బహు లయగా మొరుగుతున్నాము.
నీళ్లలో మన నీడ చూచుకుంటే,
మన రూపాలు మరింత బాగా
కనబడుతున్నాయి!”, అన్నది.
Then the third dog spoke and
said, “But what interests me most and beguiles my mind is the tranquil understanding existing between dogdoms.”
మూడవ కుక్క అన్నదిక,
“కానీ
నాకు అన్నిటి కన్నా ఆసక్తికరంగానూ
ఆశ్చర్యకరంగానూ ఉన్నదేమిటంటే,
కుక్కల సామ్రాజ్యాల మధ్య
కనబడుతున్న ప్రశాంతత!” అంటూ. At that very moment they looked,
and lo, the dog-catcher was approaching. సరిగ్గా
అదే సమయంలో చూస్తే, కుక్కలు
పట్టేవాడొకడు అటువేపే
వస్తున్నాడు. The three dogs sprang up and scampered down the street;
and as they ran the third dog said, “For God’s sake, run for your lives. Civilization is after us.”
మూడు కుక్కలూ
ఒక్క గంతులో లేచి వీధి
వెంట పరుగు ప్రారంభించాయి.
పరుగు
పెడుతుండగానే మూడవ కుక్క
“పరుగెత్తండి! ప్రాణాలు
కాపాడుకోండి. నాగరికత
మన వెంట వచ్చి తరుముతున్నదీ!” అన్నది.
THE DANCER
Once there came to the court of the Prince of Birkasha a dancer with her
musicians. And she was admitted to the court, and she danced before the prince to the music the lute and the flute and the
zither. ఒకానొకప్పుడు బిర్కషా
యువరాజు గారి సభలోకి
ఒక్క నర్తకి వచ్చింది.
ఆమెను లోనికి రానిచ్చారు.
వీణ, వేణు లయ వాయిద్యాల
సాయంతో ఆమె యువరాజు ముందు
నాట్యమాడింది. She danced the dance of flames, and the dance of swords and spears;
she danced the dance of stars and the dance of space. And then she danced the dance of flowers in the wind. ఆమె అగ్ని నృత్యం, కత్తులూ
బల్లాల నృత్యం, నక్షత్రాల
నృత్యం ఇంకా అంతరిక్ష
నృత్యం ప్రదర్శించింది.
ఆ తర్వాత ఆమె గాలిలో ఎగిరే
పువ్వుల నృత్యం చూపింది.
After
this she stood before the throne of the prince and bowed her body before him. And the prince bade her to come nearer, and
he said unto her, “Beautiful woman, daughter of grace and delight, whence comes your art? And how is it that you command
all the elements in your rhythms and your rhymes?”
అయింతర్వాత
ఆమె యువరాజు సింహాసనం
ముందుకు వచ్చి, శరీరం
వంచి సలాము చేసింది. ఇక
యువరాజు ఆమెను దగ్గరగా
రమ్మన్నాడు. అన్నాడుగదా,
అందమయిన యువతివి, ఒయ్యారం,
ఆనందాల పట్టివి. ఆ కళ ఎక్కడ
అబ్బింది మరి నీవు లయనూ,
ప్రాసలనూ ఇంతగా ఎట్లా
వశం చేసుకున్నావు అన్నాడు.
And
the dancer bowed again before the prince, and she answered, “Mighty and gracious Majesty, I know not the answer to your
questionings. Only this I know: The philosopher’s soul dwells in his head, the poet’s soul is in the heart; the
singer’s soul lingers about his throat, but the soul of the dancer abides in all her body.”
నాట్యకత్తె
యువరాజు ముందు మరొకసారి
వందనము చేసింది. జవాబుగా
అన్నదిగదా, బలశాలీ, గౌరవశాలియయిన
ప్రభూ మీ ప్రశ్నలకు ఉత్తరువులు
నేనెరుగను. ఇది మాత్రం
తెలుసు. తాత్వికుని హృదయం
అతని తలలో ఉంటుంది. కవి
హృదయం, అతని గుండెలో ఉంటుంది.
గాయకుని హృదయం గొంతులో
ఉంటుంది. కానీ, నర్తకుల
హృదయం, శరీరాన్ని మొత్తాన్ని
ఆవరించం ఉంటుంది, అని
THE TWO GUARDIAN ANGELS
On an evening two angels met at the city gate, and they greeted one another,
and they conversed. ఒకానొకనాడు ఇద్దరు
దేవతలు నగరదావారం దగ్గర
కలుసుకున్నారు. నమస్కారాలు
చేసుకున్నారు. మాటలకు
దిగారు. The one angel said, “What are you doing these days, and what work is given you?”
ఏమి జరుగుతున్నది
ఈ మధ్య, మీకు ఏ పని అప్పగించారు
అన్నది మొదటి దేవత. And the other answered, “It
was been assigned me to be the guardian of a fallen man who lives down in the valley, a great sinner, most degraded. Let me
assure you it is an important task, and I work hard.”
జవాబుగా
మరొక దేవత అన్నదీ, ఆ లోయలో
ఉండే ఒక పతితుడిని కాపాడుతూ
ఉండవలసిందిగా చెప్పారు.
ఆ మనిషి మహా పాపి. అధఃపతితుడు.
చెప్పవలెగదా, ఇది గొప్ప
పని కష్టం కూడా, అని
The first fallen angel
said, “That is an easy commission. I have often known sinners, and have been their guardian many a time. But it has
now been assigned me to be the guardian of the good saint who lives in a bower out yonder. And I assure you that is an exceedingly
difficult work, and most subtle.”
చాలా సులువయిన
పని. నాకు పాపులను గురించి
బాగా తెలుసు. వారిని రక్షించే
పని ఎన్నోసార్లు చేశాను.
కానీ, ఇప్పుడు ఆ పక్కనే
చెట్లలో ఉండే ఒక ఉత్తమ
సాధువును కాపాడుతూ ఉండవలెనని
నాకు పని విధించారు. చెపుతున్నానుగదా,
ఇది చాలాచాలా కష్టమయిన
పని. కుశలత వసరం అన్నది
రెండవ దేవత.
Said the first angel, “This is but assumption. How can
guarding a saint be harder than guarding a sinner?” నీదంతా
ఊహ. ఒక పాపిని కాయడంకన్నా
సాధువును కాయడం కష్టమెట్లా
అవుతుందీ అన్నది మొదటి
దేవత. And the other answered, “What impertinence, to call me assumptious! I have stated but the truth.
Methinks it is you who are assumptious!”
నాది ఊహ
ఉనడం ఎంతటి అగౌరవం, నేను
అసలయిన నిజం చెప్పినందుకా,
నా దృష్టిలో నీదే ఊహ, అన్నది
దేవత జవాబుగా.
Then the angels wrangled and fought, first with words and
then with fists and wings. వారికి వాదం
పెరిగింది. ముష్టియుద్ధం
దాకా వచ్చింది. While they were fighting an archangel came by. And he stopped
them, and said, “Why do you fight? And what is it all about? Know you not that it is most unbecoming for guardian angels
to fight at the city gate? Tell me, what is your disagreement?” పోరు సాగుతుంటే, అటుగా
ఒక పెద్దదేవత వచ్చాడు.
ఎందుకు తగవు, దేనిగురించి,
నగరద్వారం దగ్గర దేవతలు
పోరుకు దిగడం తప్పని
గుర్తించలేదా ఇంతకూ చెప్పండి,
మీ భేదాభిర్రాయాల గురించి
అన్నాడాయన. Then both angels spoke at once, each claiming that the work given
him was the harder, and that he deserved the greater recognition. ఇద్దరూ
ఒకేసారి, తమపని కష్టమంటూ
తమకే ఎక్కువ గుర్తింపు
రావాలంటూ గోలగా చెప్పసాగారు. The archangel shook his head and
bethought him. పెద్దదేవత తల పంకించం
ఆలోచనలో పడ్డాడు. Then he said, “My friends,
I cannot say now which one of you has the greater claim upon honour and reward. But since the power is bestowed in me, therefore
for peace’ sake and for good guardianship, I give each of you the other’s occupation, since each of you insists
that the other’s task is the easier one. Now go hence and be happy at your work.” మితృలారా, మీలో ఎవరికి
ఎక్కువ గౌరవం అందాలన్నది
నేనిప్పుడు చెప్పలేను.
కానీ, నాకా అధికారం ఉందిగనుక,
శాంతికోసం, మంచిజరగడంకోసం,
నేను మీమీ పనులను ఒకరిదొకరికి
మారుస్తాను. మీరే అంటున్నరుగదా
ఎదుటివారి పని సులభమని.
కనుక వెళ్లి మీమీ పని
చేసుకోండి, అన్నాడాయన. The angels thus ordered went their
ways. But each one looked backward with greater anger at the archangel. And in his heart each was saying, “Oh, these
archangels! Every day they make life harder and still harder for us angels!” దేవతలు
తమతమదారిని పోయారు. ఇద్దరూ
కోపంగా పెద్దదేవత వేపు
తిరిగి చూచారు. ఏమి పెత్తనం
ప్రకి నిత్యం పనిని కష్టతరం
చేయడమే వీళ్ల పనిగాబోలు
అనుకున్నారు ఇద్దరూనూ. But the archangel stood there,
and once more he bethought him. And he said in his heart, “We have indeed, to be watchful and to keep guard over our
guardian angels.”
పెద్దదేవత
అక్కడే నిలబడి ఆలోచించ
సాగాడు. ఈ రక్షకదేవతలను
మరింత గట్టిగా కాపుగాస్తుండాలిలాగుంది
అనుకున్నాడాయన.
|