I
would not believe that a man is mediocre simply because he kills the criminals and the prophets.
కేవలం
నేరస్తులనూ ప్రవక్తలనూ
చంపుతాడు గనుక ఒక మనిషిని
మధ్యరకం అనలేము.
Tolerance
is love sick with the sickness of haughtiness.
భరించగలగడమంటే,
దుడుకుతనమనే జ్వరం పట్టుకున్న
ప్రేమ.
Worms will turn; but is it not strange that even elephants will yield?
పురుగులు కదులుతాయి.
కానీ ఏనుగులు కూడూ లొంగుతాయంటే
ఆశ్చర్యం కాదూ
A disagreement may be the shortest cut between two minds.
అనంగీకారం రెండు
మెదళ్ల మధ్యగల అతిస్వల్ప
దూరం.
I
am the flame and I am the dry bush, and one part of me consumes the other part.
నేనే మంటను, నేనే
ఎండిన పొదను. నాలోని ఒకభాగం
మరొక దాన్ని దహించుతుంది.
We are all seeking the summit of the holy moutain;
but shall not our road be shorter if we consider the past a chart and not a guide?
మనమంతా పవిత్రపర్వతం
కొసమీదకు చేరాలనుకుంటున్నాం.
కానీ, గతాన్ని మార్గదర్శకుడుగా
గాక, ఒక పటంగా చూడగలిగితే
మన దారి మరింత దగ్గరవుతుందేమో
Wisdom ceases to be wisdom when it becomes too
proud to weep, too grave to laugh, and too self-ful to seek other than itself.
ఏడవడానికి
గర్వం, నవ్వడానికి మొహమాటం,
తనను తప్ప మరోటి వెదకడానికి
ఇష్టపడనంత అహంకారం వల్ల,
జ్ఞానం జ్ఞానంగా మిగలకుండా
అవుతుంది.
Had I filled myself with all that you know what room should I have for all that you do not know?
నీకు
తెలిసిన సంగతులతోనే నన్నేను
నింపుకుంటే, తెలియని
సంగతులకు చోటేదీ
I have learned silence from the talkative, toleration from the intolerant,
and kindness from the unkind; yet strange, I am ungrateful to these teachers.
నేను
వాగుడుకాయలనుంచి నిశ్శబ్దాన్ని,
అసహనుల నుంచి ఓపికను,
నిర్దయులనుంచి దయను నేర్చుకున్నాను.
కానీ, చిత్రంగా, ఆ గురువుల
ఎడ నేను అనిధేయుడుగా
ఉన్నాను.
A bigot is a stone-leaf orator.
పిడివాది అంటే
రాతి ఆకు వక్త.
The silence of the envious is too noisy.
అసూయగలవారి నిశ్సబ్దం
మరీ గోలగా ఉంటుంది.
When you reach the end of what you should know,
you will be at the beginning of what you should sense.
తెలుసుకోవలసిన
విషయాల అంతానికి చేరే
సమయానికి, అనుభవించవలసిన
విషయాల మొదటికి చేరుకుంటాము.
An exaggeration is a truth that has lost its temper.
అతిశయోక్తి అంటే
ఓపిక కోల్పోయిన నిజం.
If you can see only what light reveals and hear
only what sound announces,
Then in truth you do not see nor do you hear.
కాంతి చూపించిన
వాటిని మాత్రమే చూడగలుగుతున్నవు,,
శబ్దం వినిపించిన వాటిని
మాత్రమే వినగలుగుతున్నావు
అంటే, నిజానికి నీవేదీ
చూడడమ లేదు, ఏదీ వినడం
లేదని అర్థం.
A fact is a truth unsexed.
ఒక తథ్యం అంటే లింగభేదం
లేని నిజం.
You cannot laugh and be unkind at the same time.
నవ్వుతూ అదే సమయంలో
నిర్దయచూపడం కుదరదు.
The nearest to my heart are a king without a kingdom
and a poor man who does not know how to beg.
రాజ్యములేని రాజూ,
బిచ్చమడగడం తెలియని నిరుపేద
నా హృదయానికి చేరువయిన
వారు.
A
shy failure is nobler than an immodest success.
వినయేంలేని విజయంకన్నా
సిగ్గుపడే అపజయం గొప్పది.
Dig anywhere in the earth and you will find a treasure,
only you must dig with the faith of a peasant.
నేలలో ఎక్కడయినా
తవ్వు. న్ధి దొరుకుతుంది.
కానీ ఒక రైతుకుండే నమ్మకంతో
తవ్వాలి మరి.
Said a hunted fox followed by twenty horsemen and a pack of twenty hounds, "Of course they
will kill me. But how poor and how stupid they must be. Surely it would not be worth while for twenty foxes riding on twenty
asses and accompanied by twenty wolves to chase and kill one man."
It is the mind in us that yields to the laws made
by us, but never the spirit in us.
మనం చేసిన చట్టాలకు
తలవంచేది మన మెదడు మాత్రమే.
ఆత్మమాత్రం కాదు.
A traveler am I and a navigator, and every day I discover a new region
within my soul.
నేనే యాత్రికుడిని.
నేనే పడవనడిపేవాడినీనూ.
ప్రతి నిత్యం నా ఆత్మలో
కొత్త ప్రాంతాలను కనుగొంటుంటాను.
A woman protested saying, "Of course it was a righteous
war. My son fell in it."
అవును అది తప్పకుండా
ధర్మయుద్దమే. మరి నాకుమారుడందులో
మరణించాడు అంటూ ఒక స్త్రీ
అంగలార్చింది.
I said to Life, "I would hear Death speak."
And Life raised her
voice a little higher and said, "You hear him now."
నేను మరణం మాట్లాడితే
వింటాను అన్నాను జీవితంతో.
ఝీవితం గొంతు పెంచి
అడిగింది, ఇప్పుడు వినిపిస్తున్నదా
అని
When you
have solved all the mysteries of life you long for death, for it is but another mystery of life.
ఝీవితంలోని రహస్యాలన్నింటినీ
అర్థం చేసుకున్న తర్వాత
నీవు మరణాన్ని కోరుకుంటావు.
అవునుమరి. అది జీవితంలోని
ఇంకొక రహస్యం.
Birth and death are the two noblest expressions of bravery.
పుట్టుక, చావులు
ధైర్యానికి గల రెడు గొప్ప
అభివ్యక్తీకరణలు.
My friend, you and I shall remain strangers unto
life,
And unto one another, and each unto himself,
Until the day when you shall speak and I shall listen
Deeming
your voice my own voice;
And when I shall stand before you
Thinking myself standing before a mirror.
మిత్రమా, నీవూ
నేనూ జీవితానికి అర్థంకాము.
ఒకరికొకరం అర్థంకాము,
ఎవరికి వారం అర్థంకాము.
నీ గొంతే నా గొంతనుకుని,
నీవు మాట్లాడితే
నేను వినే దినం వచ్చేదాకా
అంతే.
అద్దం ముందు నిలుచున్నాననుకుని
నీ ముందు నేను నిలవ గలిగినదాకా
అంతే.
They
say to me, "Should you know yourself you would know all men."
And I say, "Only when I seek all men shall I know myself."
నీకు
నీ గురించి తెలిస్తే
అందరి గురించీ తెలుస్తుంది
అంటారందరూ నాతో.
అందరిని గురించి
తెలుసుకుంచే, నాకు నేను
తెలుస్తాను అంటాను నేను.
MAN IS TWO men; one is awake in darkness, the other
is asleep in light.
మనిషిలో ఇద్దరు
మనుషులుంటారు. ఒకతను
చీకట్లోనూ మెలుకువగా
ఉంటాడు. మరొకతను వెలుతురులో
నిద్రిస్తాడు.
A hermit is one who renounces the world of fragments that he may enjoy
the world wholly and without interruption.
ముక్కలుముక్కలుగా
ఉన్న ప్రపంచాన్ని వదిలి,
సంపూర్ణ పర్పంచాన్ని
నిరంతరాయంగా అనుభనించాలనుకునే
వారే సన్యాసులు.
There lies a green field between the scholar and the poet; should the scholar
cross it he becomes a wise man; should the poet cross it, he becomes a prophet.
పండితునికీ కవికీ
మధ్యన ఒక పచ్చని ప్రాతం
ఉంటుంది. పండితుడా ప్రాంతాన్ని
దాటితే జ్ఞాని అవుతాడు.
కవి దాన్ని దాటితే ప్రవక్త
అవుతాడు.
Yestereve I saw philosophers in the market-place carrying their heads in baskets, and crying aloud, "Wisdom! Wisdom
for sale!"
Poor philosophers! They must needs sell their heads to feed their hearts. Said a philosopher to a street sweeper,
"I pity you. Yours is a hard and dirty task."
And the street sweeper said, "Thank you, sir. But tell me what is your task?"
And
the philosopher answered saying, "I study man's mind, his deeds and his desires."
Then the street sweeper went on with
his sweeping and said with a smile, "I pity you too."
వీధులు ఊడ్చే
మనిషి తన పని కొనసాగిస్తూనే,
నాకు నీవన్నా జాలే అన్నాడు.
He who listens to truth is not less than he who utters
truth.
సత్యాన్ని వినే
మనిషి, సత్యాన్ని పలికే
మనిషి కన్నా ఏమాత్రం
తక్కువ కాదు.
No man can draw the line between necessities and luxuries. Only the angels can do that, and
the angels are wise and wistful.
Perhaps the angels are our better thought in space.
అవసరాలకూ విలాసాలకూ
మధ్య తేడాను ఏ మనిషీ గుర్తించజాలడు.
కేవలం దేవతలా పని చేయగలరు.
దేవతలు జ్ఞానులు, ఆలోచనాపరులు.
అంతరిక్షంలో ఉండే
మన మంచి ఆలోచనలే దేవతలేమో
He is the true prince who finds his throne in the
heart of the dervish.
జ్ఞానుల హృదయాలలో
తన సింహాసనాన్ని కనుగొనగలిగిన
వాడే నిజమయిన రాకుమారుడు.
Generosity is giving more than you can, and pride
is taking less than you need.
ఈవి అంటే వీలయినకన్నా
ఎక్కువ దానం చేయడం. స్థైర్యమంటే,
అవసరమయినకన్నా తక్కువ
మాట్లాడడం.
In truth you owe naught to any man. You owe all to all men.
నిజానికి నావెవరికీ
ఏమీ రుణపడిలేవు. ఉన్నదంతా
అందరికీ రుణపడి ఉన్నావు.
All those who have lived in the past live with
us now. Surely none of us would be an ungracious host.
గతంలో బతికిన వారందరూ
ఇప్పుడు మనతో ఉన్నారు.
మనమెవరమూ మర్యాద తెలియని
మనుషులము కాము.
He who longs the most lives the longest.
కోరికలు మరీ ఎక్కువగలవాడు
ఎక్కువకాలం బతుకుతాడు.
They say to me, "A bird in the hand is worth ten
in the bush."
But I say, "A bird and a feather in the bush is worth more than ten birds in the hand."
Your seeking after
that feather is life with winged feet; nay, it is life itself.
చేతిలో ఒకపక్షి
ఉన్నా పొదలో పది ఉన్నా
ఒకటే అంటారు నాతో.
పొదలో ఉన్న ఒకపక్షి,
ఒక ఈక కలిసి, చేతిలో ఉన్న
పది పక్షులకన్నా ఎక్కువ
అంటాను నేను.
ఆ ఊకను వెదకడమే,
రెక్కలుగల బతుకు. కాదు,
అదే బతుకు.
There are only two elements here, beauty and truth; beauty in the hearts of lovers, and truth in the arms of the tillers
of the soil.
ఇక్కడ రెండే సంగతులున్నాయి,
అవే అందం, సత్యం. అందం ప్రేమికుల
హృదయాల్లో, ఇక సత్యం, మట్టిని
దున్నే మనిషి చేతుల్లో
ఉన్నాయి.
Great beauty captures me, but a beauty still greater frees me even from itself.
గొప్ప
అందం నన్ను పట్టేస్తుంది.
కానీ అంతకన్నా ఎకకువ
అందం నన్ను తననుంచి కూడా
విముక్తుడిని చేస్తుంది.
Beauty shines brighter in the heart of him who longs
for it than in the eyes of him who sees it.
అందాన్ని చూచే
కళ్లలోకన్నా దానికోసం
తపనపడే కళల్లో అది మరింతగా
వెలుగుతుంది.
I
admire him who reveals his mind to me; I honor him who unveils his dreams. But why am I shy, and even a little ashamed before
him who serves me?
తన మనసును నాకు
చెప్పేవారిని నేను అబిమానిస్తాను.
తన కలలను తెరవిప్పి చెప్పే
వారిని నేను గౌరవిస్తాను.
ఇక సిగ్గెందుకూ, నాకు
సేవచేసే వారి ముందు మాత్రం
నేను కొంత సిగ్గిల్లుతాను.
The gifted were once proud in serving princes.
Now
they claim honor in serving paupers.
చేతనయిన వారు
ఒకప్పుడు యువరాజులకు
సేవచేసి గర్వించారు.
ఇప్పుడు మాత్రం
వారు నిరుపేదల సేవే గౌరవమంటారు.
The angels know that too many practical men eat
their bread with the sweat of the dreamer's brow.
చాలా మంది మనుషులు
తమ తిండిని కలలుగనేవారి
కనుబొమ్మల చెమటలో ముంచుకు
తింటారని దేవతలకు కూడా
తెలుసు.
Wit is often a mask. If you could tear it you would find either a genius irritated or cleverness juggling.
తెలివిగల మాటలు
ముసుగులాంటివి. ఆ ముసుగును
చింపేస్తే, ఒక చిరాకుగల
తెలివిని లేదా, గారడీ
చేస్తున్న చురుకు తెలివిని
చూస్తాం.
The understanding attributes to me understanding and the dull, dullness. I think they are both right.
అర్థం చేసుకోవడమంటే,
స్తబ్ధులనూ, స్తబ్ధతనూ
అర్థం చేసుకోవడమే. వాళ్లిద్దరూ
సరయినవారేనని నా నమ్మకం.
Only those with secrets in their hearts could divine
the secrets in our hearts.
తమ గుండెలో రహస్యాలు
గలవారే, మన గుండెలో రహస్యాలు
ఉంచగలుగుతారు.
He who would share your pleasure but not your pain shall lose the key
to one of the seven gates of Paradise.
నీ సుఖాన్నే గాని
దుఃఖాన్ని పంచుకోని వాడు,
స్వర్గపు ఏడు ద్వారాలలో
ఒక దాని తాళంచెవి పోగొట్టుకుంటాడు.
Yes, there is a Nirvanah; it is in leading your
sheep to a green pasture, and in putting your child to sleep, and in writing the last line of your poem.
అవును,
నిర్వాణం ఉంది. అది నీ
గొఱ్రెలను పచ్చికలోకి
తోలడంలో ఉంది. నీ పిల్లను
నిద్రపుచ్చడంలో ఉంది.
ఇక నీ కవిత చివరి పాదం
రాయడంలోనూ ఉంది.