తను పొద్దున్నే లేవడానికి
కష్టపడ్డాడు –
గుడ్డివెలుతురుకే
కళ్లు చికిలిస్తూ – అటూ ఇటూ తిరుగుతూ -
తలగడలో తల దాచుకుంటూ
----
మళ్లీ నిద్ర కోసం మధనపడ్డాడు.
మధురవసంతమా మరలి రాగదే
------
ఎవరో చెప్పారు – ఎక్కడో ఒక దీవిగురించి
----
అక్కడ పూలూ –
అడవిసింహాలు తప్ప ఉండవని
–
ఆపూలూ, ఈనాగరిక
ప్రపంచంలో అంతంతమాత్రంగానే
విచ్చుకుంటాయి –
అక్కడి నేలా,
రాయీ, గాలీ పూలకిష్టం
–
అక్కడ లేమి వాటిని
అందాలలోకి తరుముతుంది
తను పొద్దెక్కిందాకా
పడుకుంటాడు – సాయంత్రాలు
సరదాగా గడుపుతాడు –నిద్దరలోనే ఎక్కడలోని
శక్తీ సంపాయించుకుంటాడు
–
తన కళ్లముందు కాలం
విలువ నిలువదు –
ఖర్చు చేయాల్సిందిగా
కనిపించదు –
బ్రతకడం కోసం ఆలోచనలను
అతకడం కోసం ఏమీ చేయాల్సిన
అవసరం కనిపించదు –
ఈ సంవత్సరం కాంతి ఎందుకని
ఇంత వెలవెలపోయింది – మండే ఎండలు కూడా మసకబారినై
–
ఇప్పుడు తను ఊళ్లోకి
వెళతాడు – గుళ్లోకి వెళతాడు
– ఇరానీ చాయ్ కొట్లో
వరుసగా ఆరు సగం కప్పులు
తాగుతాడు –అదేపనిగా
అలవాట్లను అరువు తెచ్చుకుని
అలవాటు తేసుకుంటాడు – కరడుగట్టిపోతూ సంతోషిస్తాడు
–
అయ్యో! ఈవాళ
కుదరదు! బిజీ!
వచ్చేవారం చూడగూడదూ అంటాడు
ఫోన్లో –
వచ్చేవారం ఫోన్ పెట్టేస్తాడు
–
మాటల్లోగానీ చీటీల్లోగానీ
మాట యివ్వడు
వాటితో నిలవడు –
అందరితో అలా అరగంటలూ
గంటలూ గడిపేస్తాడు – అర్థం లేని గంటలను
అరచేతిలో నలిపేస్తాడు
–
వాటి రుచి చూస్తాడు
– అందుకే కదా వచ్చాడు -----
తనలో తనే మాయం కావాలనుకుంటాడు
–
అదెవరికీ పట్టదు – వాళ్లందరికీ తనింకా
వెర్రివాడే – కుర్రవాడే
---
తాము రూపం ఇచ్చిన పిల్లమేఘమే
---
మేఘం ఎదురుపడుతుంది
--- కానీ ఈనాటిదా అది
ఆనాటిది కదూ -----
ఇప్పుడు తను మారిపోలేదూ
---
ఒంటరితనం కోరుకుంటాడు
–
ఏమీ అడగకుండా ఉంటాడు
–
ఆశలను తింటాడు – నమ్మకాలను కొంటాడు
– రానురాను
మారిపోతుంటాడు –
ప్రపంచం గురించి ఆలోచనలు
పెంచుకుంటాడు –
పనికావాలంటాడు
సేవచేస్తానంటాడు
– ఒక అంకురం నాటీ – వంశాంకురం తోటీ –
ఇదంతా మార్పా -----
మాన్యం కావాలి – మగువ కావాలి –
మార్పు కావాలి –
పొద్దన్న ఎద్దులను తీసుకుని
పొలానికి వెళ్లాలి – మధ్యాహ్నం చద్దిమూట
కావాలి – ఇంట్లోకి ఇల్లు
కావాలి – వారానికి సెలవు
కావాలి – పిల్లా పాపలతో
ఇల్లు కళకళలాడాలి ---
వృత్తం – ఆవృతం
- పునరావృతం ----
తనకు నిజం కావాలి – ఒక అంకురం కావాలి – ప్రతీ వసంతంలో మారాకు
వేసే ఆ కొమ్మలపై తన పిల్లలాడుకోవాలి
– పండ్లు
తెంపుకోవాలి –
తనకు జామకాయలు ఇష్టంలేదు
– అయినా జామచెట్టు కావాలి
– తన కొడుకు కోసం కావాలి
– తన కొడుకు కొడుకు కోసం
కావాలి ---కొడుకయినా బిడ్డయినా
వాళ్లకే కావాలి -----
పండ్లు చేతికందాలంటే
ఇంకెంత కాలం – బయట
ప్రపంచంలో పిల్లలున్నారు
– పళ్లూ ఉన్నాయి – కుంటి పిల్లలు – గూని పిల్లలు – కుళ్లిన చెట్లు – క్రుంగిన చెట్లూ –
వీళ్లందరికీ తానా
అండ -------
నమ్మకం – నా నమ్మకంలాగ
ఏదీ జరగదని నా నమ్మకం
– నా బాబు – వాడి
జామిచెట్టు –నా నమ్మకం
వమ్మయిన మరినాడే వస్తారని
నా నమ్మకం – అప్పుడే
నేనను వాళ్లను చూచుకోగలనని
నా నమ్మకం - ---- నా అంతిమ ఘడియలదాకా
వాళ్లతోనే ఉంటానని నా
నమ్మకం – కానీ నేనింకా
బతికే ఉన్నాను ఖచ్చితంగా
----
ఈనాడు నాకింకా ఇరవై
ఏళ్లే – ఆ గ్రంధాలయంలో
కూచుని – అంతా అయిపోయిందని
ఇంకా తాను బతికే ఉన్నాడనీ
తెలుసుకున్నాడు – తను ---
ఆ మెత్తని పుస్తకాల్లో
– ఆ మెత్తనిపేజీల కదలికల్లో-
ఆ మెత్తని గుసగుసల్లో
– ఆ మెత్తని అడుగుల్లో
– ఫరవాలేదు –
పుస్తకాలు నిద్దరలేవవు
– అనుకున్నాడు –
పుస్తకాలపై పరుచుకున్నాడు
– ఎవరికయినా నా భయమ అర్థమవుతుందా
అనుకున్నాడు –అలోచనలు
మెదడు నిండా గజిబిజిగా
పడి ఉన్నాయి- ఉయ్యాల ఊగుతోంది
– పైకి యింకా పైకి – కళ్లుతిరగడం లేదు
కాళ్లు ఆకాశానికి తాకుతున్నాయి
– కప్పులోంచి బయటికి
దూసుకిపోతున్నాడు తను
–
అంతా అర్థమయిపోయింది
– ఆనందం ఆర్ణవమయిపోయింది
–మరొక్క ఆలోచన –
అప్పుడే ఆ క్షణంలోనే
కలలోపల ఒక్కపోటు – ఒళ్లంతా వంకర్లు తిరిగేలా
- ---
ఉయ్యాల్లోంచి దూకేశాడు తను –
ఆలోచనల హద్దులు దాటాడు తను –
అంతం ఆవలికి అడుగేశాడు తను –
మెదడులో గడియారం –
టిక్ టిక్ టిక్ -----
క్షణాలపాటు పొడుస్తున్నట్టు --- పిచ్చెక్కుతోంది --- పుస్తకం గట్టిగా పట్టుకో --- మూర్ఛపో తెలివిగానే --- తెలుస్తూనే నిదరపో ---అంతందాకా వచ్చేశాడు తను ---
అంతకు ముందెన్నడూ లేనంతగా అంతందాకా వచ్చేశాడు తను ---
ఆనాడు
అమ్మాయితో కూడాఅంత అంతం
చూడలేదు తను
నళినితో,
కొండల్లో, కోనల్లో తను
అడవిలో
లేడిలాగ, తోటలో హంసలాగ,
బాతులాగ బంగారు గుడ్డులాగ---
అంతా గ్యాపకం
ఉంది తనకు. అవును, అప్పుడేమయిందో
ఇప్పుడే తొలిసారిగా తెలుస్తోంది
తనకు---
వణుకుతూ,
తడుస్తూ, వంకర్లు తిరుగుతూ,
ఆరాత్రి, ఆ కాళరాత్రి,
బర్సాత్ కీ రాత్-----
చాలీచాలని
దుప్పట్లో, వచ్చీ రాని
నిద్దట్లో, అటులాగీ, ఇటులాగీ,
అరుచుకునీ, కరుచుకునీ,
కునుకుతూ, కులుకుతూ, -----
అంతకు ముందే
మౌళికి చెప్పాడు తను,
ఎందుకు
చెప్పాడో మౌళికేం తెలుసు,
వాడేం చేయగలడు
అంతా చెర్రాడు
తను, గోరంత కూడా దాచకుండా,
ఎందుకు
చెప్పాడో,
ఇంకెవరికి
చెప్పాలో, ఇంకేం చేయాలో
తెలియక,
అదంతా తనకర్థం
కానందుకు,
వాడుమాత్రం
ఏం డాక్టరా? ఎందుకు చెప్పాడో?
నళిని –
అయ్యో తనకేమయిందని?
నళినికేమయిందట? – తనకు
తెనిస్తేగద!
ఏదారీ తెలియక,
ఆడవాళ్లతో ఏదారీ తెలియక,
గోదారే
గతని మాత్రం తెలుసా నాన్నా?
నళిని ,
చిన్నది, తనుమాత్రం చిన్నకాదూ?----
తనతెలివి,
నళినికి చూపిన తన తెలివి,
నలుగురికీ
తెలియని తన తెలివి,
నళినిని
ముంచిన తన తెలివి, -----
అప్పుడేమయింది?
ఈతెలివి
మౌళిగాడిదా? వాడికి గోదారి
తెలుసా? దారి తెలుసా, త్రిపుర
సుందారి తెలుసా?
అంతా నటన,
వాడికీ తెలువదు. గాడిదా,
మౌళిగాడిదా!
బిళ్లలు,
మందు బిళ్లలు, వాడొక డాక్టరయాడు,
మందులు సృష్టించాడు,
నళిలి, మందు,
నీళ్లు, గుడిసె, అంతం, అయ్యో,
గాడిదా,మౌళిగాడిదా,
వాడెంతో
తెలిసినట్లు, ఉపన్యసించాడు.
మహాన్యసించాడు,
సన్యసించాడు
మాత్రం కాదూ
యిష్టం
లేకున్నా, వాడిని ఇష్ట
పడ్డట్లు నటన,
గాడిదా,
అసూయ---
అమ్మాయిరా,
అందునా అనాఘ్రాతం పుష్పం,
కిసలయమనావిద్ధం,
పశువా, పద్యం
చదువుతావురా?
వాహ్ నువు
లక్కీగురూ!
నా బొంద
లక్కు, మందుబిళ్లలక్కు,
గుడిసె లక్కు, మందులక్కు,
మౌళిగాడితో
సిగరెట్టు – దమ్ము, దుమ్ము
వాడి వెధవ
ఆలోచనలు పీల్చినట్లున్నాను
ఇదుగో చూడూ
కొంపమునిగిందేమీ లేదు,
చేతులు
దులుపుకో, కళ్లు నులుముకో,
దారి చూచుకుని బయటపడు,
సమ్ఝే-----?
ముందుదారి
చూచుకోరా కుర్రకుంకా,
గుదిబండ, మెడకు డోలు!
నేచెపుతుంటే
వినరా సన్నాసీ!
ఆలోచన,
నటన, గాడిదా, మౌళిగాడిదా!!!!
భయం! మౌళిని
చూస్తే భయం!
నళినిని
చూస్తే భయం – బల్లిని
చూస్తే భయం
పిల్లిని
చూస్తే భయం ----- భయం ----!!
నళినీ ---
నిన్ను తాకనిక --- పాపం తగులుతుంది
–!!
నిన్నేం
చేస్తానో నీకు చెపుతానా?
అందుకనే
అర్ధరాత్రి నిద్రలేచి
కాంపౌండులోని వేపచెట్టు
కింద
అరుగు మీద
---- ఆలోచనల్లో ----
అంతమౌదామనుకుంటుంటే
---
వాళ్లిద్దరూ
----
నన్ను నేను
జాలిగా చూచుకుంటుంటే
----
వాళ్లిద్దరూ
---
ఇటొకరూ
– అటొకరూ ---
చెక్కిలి
చేర్చి, అక్కున చేర్చి,
దిక్కులు చూచి,
చేతులు
చాచీ, చెంగున దూకీ,
వాళ్లగదిలో
నవ్వుతోంది తనేనా?
పక్కవాటాలో
పడుకుని, ఏడుస్తూ, నిద్రిస్తూ,
ఏడుస్తూ, నిద్రలో ఏడుస్తూ,
ఏడుపులో నిద్రిస్తూ
ఇకనేనా
బాగుపడగలనా, అడగగలనా,
అంతా అర్థం అయినట్లుంది
– అంతా సులభమయినట్లుంది,
అందినట్లుంది,
కోరిక లేనట్లుంది – కోరికగురించి
కోరిక లేనట్లుంది ----
కోరిక లేమి
గురించి కోరిక లేనట్లుంది
------
వా ళ్లిద్దరితో
---- అడుగు ముందుకు పడే సరికే
---
నళిని మాయం !—గజం
ముందుకు కదిలే సరికి
భయం --- భయం ----!!
నళిని లేదు,
కొండల్లో, కోనల్లో, అడవుల్లో,
తోటల్లో,
నాకులేదు,
నళని లేదు ----
మనసులో
లోతుల్లో, పొరల్లో, అరల్లో,
ఉందా --- వెతుకు ----
సంధ్యా
వందనం స్వామికప్పజెప్పి,
జంద్యాలను బంధాలను తెంపిన
వాడు,
తానుతోడిన
గుంటలో తానే జారినవాడు,
నిజాలను,
మ్యూనిజాలను వడికిన వాడూ,
లెక్కవేసి
భూమి తిరుగుతోనే ఉందనీ,
విశ్వం
పెరుగుతోనే ఉందనీ,
తోకచుక్క
పరుగుతోనే ఉందనీ, లెక్కవేసి
----
తలపంకించి,
తానే యుగంలో బతుకుతున్నాడని,
లెక్కవేసినాడు---
అందరిలాగే
తనకూ ఏమీ తెలియదనీ,
అంతలోఅంత
ఏదో కొంత మాత్రం తెలుసు,
అందరికీ
అంతే తెలుసు ----
తప్పన్నది
తానెరుగని,
ముప్పదిమందికి
సరిపడు పనిగని,
మరిమనిషి
తెలుసు,
సమయానికి
బస్సు స్టార్ట్ చేయలేని,
గడియారం చూడలేని ఆ డ్రయివరూ
తెలుసు ----
నక్షత్రా
లు ఆలస్యంగా రావూ,
తోకచుక్క
ఆలస్యంగా రావూ
కవిత్వ
తత్వ విచారం వినిపిస్తే,
విచారంలో
మునిగి
ఆలస్యం అయిపోవూ-----
ప్రపంచం
ఈక్వేషన్ హిట్ అండ్ ట్రయల్
ప్రపంచం
ఈక్వేషన్, జవాబు దానంతటదే,
బంగారం
ఈజ్ ఈక్వల్ టు బంగారం
సింగారం
ఈజ్ ఈక్వల్ టు సింగారం
నీవు ఈజ్
నాట్ ఈక్వల్ టు ప్రపంచం
ప్రపంచం
ఈజ్ నాట్ ఈక్వల్ టు నీవు
మంచీ, చెడుగురించి
మాట్లాడకు,
మరిచిపోయిన
పాతసంగతులను గురించి
తోడకు,
కిరోసిన్
లోంచి కరెంటు లోకి,
బండీ లోంచి
బస్సులోకి,
ప్రగతి
--- పో --- వెళ్లిపో ----!!!!
పాతమనిషీ
పాతమనిషిని మరిచిపో-----!!!!
అంతా కొత్త,
నీవు కొత్త,
చోటు కొత్త, నీ స్థాయి
కొత్త,
అంతా కొత్త,
అంతం కొత్త, కొత్త అంతం,
అనంతానంత
అంతం కొత్త,
కొత్త అనంతానంత
అంతం,
అందుకే
33 =34= 35= 36 -------!!!!!!!