ఆకు
పచ్చని ఎడారి (కవితా
సంకలనం )
నగరం గానుగలో
చదువుల పేరునా, బతుకు దెరువును వెదకడం
పేరునా నలిగీ నలగీ,
ఉదారి నారాయణ ఆదిలాబాద్ అనే తన
తల్లి ఒడిలోకి
తిరిగి చేరుకున్నాడు. అమ్మ బతుకునూ, ఆదిలాబాద్ బతుకునూ, అక్కడి మనుషుల బతుకునూ
ఆర్తితో గమనించి కవితలల్లడం
మొదలు చేశాడు. అలా
మొదలు పెట్టిన కవితా
వ్యయసాయంలో
మొదటి
పంట ఈ ఆకుపచ్చని
ఎడారి. ఎడారి లాంటి
ఆదిలాబాదు నారాయణ కవితతో
ఆకు పచ్చనయింది. మట్టి జీరలు పేరున ముందుమాటలు
రాసిన డా. ఎన్. గోపి
గారన్నట్లు మొదటి సంకలనం
గనుక నారాయణ కవిత్వంలో
ఇంకా బాల్యం కనిపిస్తున్నది. కానీ నగరంలోని కవితా
పాఠశాలలో కాకుండా మట్టి
వాసనలో నుంచి వచ్చిన
ఈ కవితల్లో మరెవరి ముద్రలూ, నీడలూ జాడలూ కనిపించడం
లేదని మాత్రం వెంటనే
గుర్తించవచ్చు.నగరంలో
ఉంటే కవిత్వానికి మెరుపునిచ్చే
గురువులుంటారు గానీ, వారి నీడలో చేరిన చిరుకవులు
నిజంగా చాలా కాలం లఘువులుగా
మిగిలిపోతారు. నీటిలో దూకి, తనంత
తానే ఈదడం నేర్చినట్లు
ఈ కవి వరుసగా తన కవితకు బలం అద్దడం
నేర్చుకున్నాడు.
ఇతను ఉదయిస్తున్న కవి. రవి కిరణాల లాగే మొదట
ఈయన బలమూ అంత సూటిగా కళ్ళలో, మనసులో కుచ్చుకోకపోతే
తప్పులేదు. కానీ
త్వరలోనే మధ్యాహ్నమయి
ఇతని హృదయబాధ అందరినీ
అందుకుంటుందనడానికి
గట్టి ఉదాహరణలు కొల్లలుగా
కనబడుతున్నాయి. ఈ పుస్తకంలో!
బాల్యం
నిద్రలేవాలి అనే ఒక్క
కవిత చాలు. నారాయణ
కవిగా నిలదొక్కుకున్నాడని
నిరూపించడానికి!
బాధలోంచి పుట్టిన
బలమయిన మాటలవి.
`బతుకు
నిలువుటద్దానికి వెనుక
పూతవి'
`గొంతుకు
మాటలు మొలవడం నేరమవుతున్నది'
`వాగు
తల్లి తలస్నానం' మొదలయిన మాటలు అతని అభివ్యక్తిలో
ఉన్న బలాన్ని రుచి చూపించేవి. చింతల చింత, ఉరుకుతున్న ఉగాది లాంటి కవితల్లో
కూడా ఈ బలం తొంగి చూస్తుంది. అందరికీ
అర్ధం అవుతుందా? లేదా? అన్న ప్రశ్నను
పక్కన బెట్టి నారాయణ
మరిన్ని మాండలికం కవితలు రాస్తే
ఆ బలం మరింత సులభంగా కనబడుతుంది.
ఇతను చిమ్నీలని చిన్న
చిన్న కవితలు వెలయించే
ప్రయత్నం చేశాడు. చిమ్నీ వెలుగు
ఇంకా పెరగాలి!
ప్రభావాలు
పడకుండా, కేవలం, అనుభవమూ, ఆర్తీ
బలంగా కలం నడిపే నారాయణ
ముందు ముందు రాసే కవితల
కోసం అందరూ ఎదురు చూస్తారు. అందాకా ఈ
ఆకుపచ్చని ఎడారిని అనుభవిస్తారు.