`` ఇవేమిటి బ్రతికున్నాయా
కొంపదీసి?'' అనుమానం
ధైర్యంగానే బయటపెట్టాను.
``లేదు!
కానీ త్రిల్ కోసం వాటికి కదలిక, అరుపు ఏర్పాటు చేశాం!''
`` అవునూ! ఈకలు
గొంతుల్లో ఇరుక్కోవా?'' కాస్త ధైర్యం
వచ్చినట్లుంది.
`` నెవర్! నిజానికి
వాటి రంగు బట్టి సీజనింగ్ గ్రేడ్ గుర్తించవచ్చు!
రంగు ఎంత డార్క్
గా ఉంటే అంతబాగా ఉడికినట్లు
లెక్క!
ఇక మీరు
కానివ్వండి! మళ్ళీవస్తాను!'' మాయమయింది వెయిటర్ అమ్మాయి.
వీటిని కట్ చేయకూడదు. అందుకే కాబోలు ఫోర్క్, నైఫ్ బదులు
అందమయిన టాంగ్స్ ఇచ్చారు. నెమ్మదిగా మొదటి
కోడిని పట్టుకుని తెల్లని సాస్లో ముంచి నోట్లో
వేసుకున్నాను. బ్రహ్మాండం! ఇది
బటర్
చికెన్! ఏం రుచి నములుతుంటే ఈకలు ఎముకలు
కరకరలాడుతూ భలేగా ఉంది. నెమ్మదిగా జింజర్ చికెన్, లిక్కర్ చికెన్ కూడా
ట్రైచేశాను. భలేగా
ఉన్నాయి.
`` ఇంతకూ వీటినేమంటారు
మిస్!''
ఈసారి
చాలా సులభంగా అడిగేశాను.
``వాటికో ప్రత్యేకమయిన
పేరేమీలేదు! మినీ
చిక్
అంటే చాలు! త్వరలోనే హైదరాబాద్, విజయవాడల్లో కూడా వీటిని
ఇంట్రడ్యూస్ చేస్తారట మా వాళ్లు. మీరు
అక్కడ ఎంజాయ్ చెయ్యవచ్చు!'' అంటూ
నా క్రెడిట్ కార్డ్ ప్లేట్లో పెట్టి
తిరిగి ఇచ్చింది.
సైన్స్ అభివృద్ధి చెందుతోందని
తెలుసు. బయో టెక్నాలజీ
సాయంతో మందులు, పంటలు వగైరా పెంచుతున్నారని
తెలుసు. పశువులను
పెంచుతున్నారని కూడా
తెలుసు! కానీ
ఈ మినీ చిక్ గురించి మాత్రం వినలేదు. హ్యాట్స్ ఆఫ్! అందుకే తాతయ్య అంటూ ఉండే
వాడు ``
తెల్లోడిబిస!'' అని.
నేను మినీఫుడ్ ఫాన్ అయిపోయాను. అవకాశం
చిక్కినప్పుడల్లా ఏదో ఒక టెక్ ఫుడ్ స్టాల్లో దూరి ఏదో
ఒకటి తింటూనే ఉన్నాను. బాతులు, మేకలు, కుందేళ్లు, ఒకటేమిటి రకరకాలు వస్తున్నాయి
ఈమధ్యన. మొన్న
అబిడ్స్ లో అదేదో స్టాల్లో మినీ టార్ టాయిస్ తిన్నాను. వింతగా
ఉంది. బయోటిక్ విచిత్రంగానే
ఉంది. గొర్రె ఉన్ని
తిన్నా, తాబేలు
బొచ్చె తిన్నా రుచిగానే
ఉన్నాయి. అంతకంటే
ఆశ్చర్యం మినీ ఫ్రూట్ సలాడ్! బౌల్
నిండా
ఛెర్రీస్ సైజ్‌లో పుచ్చపళ్లు, మామిడి పళ్లు, కర్బూజాలు, ఒక్కొక్కటే తీసి నోట్టో వేసుకుంటే కరిగిపోతున్నాయి. రుచి ఫెంటాస్టిక్, మామిడి కాయలో
టెంక కూడా ఉంది. నమిలితే అచ్చు
కాజూ రుచిలో ఉంది. తొక్కలు ఘుమఘుమ
లాడుతున్నాయి. వీటన్నింటిలోకి బత్తాయిలు
చాలా బాగున్నాయి. తొక్క లోపలనుంచి తొనలు కనపడుతున్నాయి
కూడా!
పేపర్లో కనబడ్డ ప్రతి అడ్వర్టయిజ్ మెంట్‌నూ ఫాలో చేస్తూ ఊర్లో
ఉన్న మినీ ఫుడ్ స్టాల్స్ అన్నీ పావనం
చేశాను. ఈ మధ్యనే
సికింద్రాబాద్లో ఒక చోట మినీ ఫిష్ ప్రారంభించారు. వాళ్ళ స్పెషాలిటీ
డిష్
ఏమిటో
తెలుసా? మినీ
తిమింగలం! అయితే
ఒక్కడినీ తినడం కుదరదన్నాడు. కనీసం నలుగరయినా
కలిసి వస్తే సర్వ్ చేస్తానన్నాడు. తిమింగలాలు తరిగిపోకుండా
కాపాడారని పేపర్లో చదివాను. కానీ అవి సంఖ్యలో
పెరిగి సైజులో తరిగి
డైనింగ్ టేబుల్ మీదకు వస్తాయని
మాత్రం అనుకోలేదు. దీన్నెలాగయినా టేస్ట్ చేయాలి! కంపెనీ కోసం వెదకాలి!
########
కాన్ఫరెన్స్
అయిపోయింది. సాయంత్రం బజారులో
పరధ్యానంగా నడుస్తున్నాను. కాస్తేదయినా తింటే
వెళ్ళి నడుం వాల్చవచ్చు. నిజానికి
ఆకలిగా లేదు. మధ్యాహ్నం
చాలా పద్ధతిగా భోజనం
ఏర్పాటు చేశారు. ట్రెడిషనల్ భోజనాలు అలవాటు లేకుండా
ఉంది. అయినా బాగానే
తిన్నాను. కాబట్టి
కొంచెం ఏదయినా తింటే
చాలు. తళుక్కున `సాఫ్ట్ టెక్' గుర్తొచ్చింది. నా మినీ ఫుడ్ తొలి అనుభవం ఈప్రాంతంలోనే
అనేమాట కూడా గుర్తొచ్చింది. వీధి చివర ` ఇన్ఫర్ మేషన్ కౌంటర్' లోకి వెళ్ళాను.
` ఇక్కడి నుంచి సాఫ్ట్
టెక్
చాలా దగ్గరే
అనుకుంటాను. ఎలా
వెళ్ళాలో చెప్పగలరా?''
`` వెల్కం! జెంటిల్ మన్! అంతకన్నా మంచి
ఫుడ్‌స్టాల్ పక్కనే ఉంది. ``బిగ్టెక్''
ట్రై చేయకూడదూ? ఇదుగో ఈ పక్క బిల్డింగులోనే!రండి చూపిస్తాను'' అంటూ అతను లేచి
దారి తీశాడు.
అప్రయత్నంగా అతని వెనకాల
నడిచాను.
ఎల్ సి డి డిస్ప్లే
బోర్డులో`బిగ్టెక్' అన్న చిన్న చిన్న అక్షరాలు
రకరకాల రంగుల్లో మెరిసి
మాయమవుతున్న ఒక స్టాల్ లోకి చేరుకున్నాం. ``వెల్కం ఫ్రెండ్స్! మీ టేబుల్ నంబర్ `జి డబుల్ ఎక్స్' అన్నాడు
కౌంటర్లో అబ్బాయి.
``థాంక్యూ! నేను
భోజనానికి రాలేదు. ఒక కొత్త నేస్తాన్ని తీసుకువచ్చాను. హెల్ప్ హిమ్! అని నాతో బాటు వచ్చినతను
సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు `రండి ఫ్రెండ్! మీకు `డి. ఎక్స్' అలాట్ చేస్తాను! యువర్కార్డ్ ప్లీజ్! అంటూ అబ్బాయి కంప్యూటర్లో ఏవో కమాండ్స్ పంచ్ చేశాడు. హాల్లో డి ఎక్స్ సులభంగానే దొరికింది. టేబుల్ మీద మెనూ కార్డు రెడీగా
ఉంది. అదొక ఎలక్ట్రానిక్ మానిటర్ లాంటిది. కీస్ నొక్కుతూ లైట్ అయిటమ్స్ కోసం
వెదికాను. ఒక
పేజ్లో ఎగ్స్, మరొక పేజ్లో పళ్లు కనబడ్డాయి. ఒక ఎగ్ కాసిని గ్రేప్స్ ఆర్డర్ పంచ్ చేశాను. ``వీటిని
ఎక్కడ డెలివర్ చేయమంటారు?'' అనే ప్రశ్న మానిటర్ తెరమీద వచ్చింది.
`` ఇక్కడే తింటాను'' అని జవాబు ఎంటర్ చేశాను.
`` ఇంపాజిబుల్! మీరు ఒక్కరే ఉన్నారు!'' జవాబు.
నేను మళ్ళీ చిక్కుల్లో
పడ్డాను.
`` ఒకసారి ఇలా వస్తారా?'' కౌంటర్లో అబ్బాయిని పిలిచాను.
`` నాకు తెలుసు! మీరిలా
పిలుస్తారని. మీ కమాండ్స్ నేను చూస్తూనే
ఉన్నాను. ఒక ఎగ్, కొన్ని
ద్రాక్షపళ్లు తినాలంటే మీరు పురాణకాలం
నాటి హీరో అయి ఉండాలి.
ఇన్ఫర్మేషన్ అతను మీకు మా స్టాల్ గురించి చెప్పలేదనుకుంటాను. అతను సరదాకోసం అలా
చేసి ఉంటాడు. మా
స్పెషాలిటీ బిగ్ఫుడ్ బయోఫుడ్ ఫార్మ్స్ వాళ్లు కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్లు సప్లై
చేసే ఒక బాయిల్డ్ ఎగ్
మీ కుటుంబానికంతా
సరిపోతుంది. మీరు మహా అయితే ఒక
ద్రాక్షపండు తినగలరు. రొయ్యలు, మష్రూమ్స్, రకరకాలు
సూపర్
సైజుల్లో మా దగ్గర
దొరుకుతాయి. ఎక్స్
టేబుల్లో మామూలు ఆర్డరు
స్మాల్ సైజ్ స్లైస్కన్నా ఎక్కువ ఉంటే
మా కంప్యూటర్ హోమ్డెలివరీ
కింద లెక్క పెడుతుంది. మీరు ఒక ముక్క ఎగ్, ఒక ముక్క గ్రేప్ ఆర్డర్ చేయండి. రోబో
తెచ్చి పెడుతుంది!'' అన్నాడు ఆ అబ్బాయి.
ఈసారి నాకు కోపం
రాలేదు. ఆశ్చర్యం
అంతకన్నా లేదు!
`` వండర్ ఫుల్ బయోటెక్నాలజీ!'' అనుకున్నానంతే!