ముప్ఫయి మూడు
మనిషికి ముప్ఫయి
మూడేళ్లు వచ్చినా ప్రజలు
మాత్రం వాణ్ణింకా కుర్రవాడు
అనడం మానరు. అతనికి కూడా
తనలో ఏ మార్పూ కనిపించక
పోవచ్చు. కా నీ ఒక అపనమ్మకం.
తానింకా నిజంగా కుర్రవాడేనా?
అతను ఓ శుభోదయాన
నిద్ర లేస్తాడు.
ఆరోజు అసలు తనకు
జ్ఞాపకం ఉంటుందా?
పడక మీంచి పైకి
లేవడు-
సూర్యుడి వేడివాడి
కిరణాలు గుచ్చుకుంటాయి.
శుభోదయం - ఈరోజు గడుస్తుందా?
వెలుగు భరించలేక
కళ్లు మూసుకుంటే-
జీవితం అంతా తుడిచి
పెట్టుకుపోయి...
ఊబిలోకి కూరుకుపోతాడు.
అంతా నాశనం! తన గొంతు
తనకు వినిపించదు!
అధఃపాతాళానికి
– అస్తిత్వం
– సమసిపోయి
–
కరిగిపోయి – మారిపోయి
– మాసిపోయి
–
అంతంతకీ లోతుకి
–
మళ్లీ తెలివి కలిగితే
–
తనూ మనిషే – ఒక ఆకారం
– ఒక వ్యవహారం.
లేవాలి – జీవితాన్నెదురుకోవాలి
నూతన శక్తితో – జ్ఞాపకశక్తితో----
అబ్బ! ఏం జ్ఞాపకశక్తిది!
అదీ ఇదీ అన్నీ
జ్ఞాపకమున్నాయా? – ఎప్పటిలాగే!
గతజీవీతాన్ని
తోడుకోవాలా గడిచిన రోజులూ
నడిచిన బాటలూ -
కష్టించి మెదడు
లోతుల్లోంచి
బయటికి తీయాలి.
ఈ వల వేసి తన చుట్టు
తానే –
తనను తానే పట్టుకోవాలి
-, అప్పుడు
కాలం గడిచింది.
తానెవ్వరు? తానేమయినాడు?
వలవేసింది తనే -
వలలో పడిందీ తనే -
ఇప్పటి వరకు రోజులు
గడుస్తున్నాయ్-
రోజూ ఏదో చేస్తూనే
ఉన్నాం.
ఏదైనా చేయవచ్చు-
ఏమైనా కావచ్చు-
మహావ్యక్తి, తాత్వికుడు,
తార్కికుడూ, ఏమైనా-
కార్యశూరుడూ, కావిగుడ్డలు
కట్టి, కాడి చేతబట్టి,
గంజి, గటకా, తాగి,
చెమటతో పుడమిని తడిపి,
---మౌనంగా----
అవును మాటలెందుకూ-
కాదంటే, కుళ్లిన,
వయసు మళ్లిన సంఘానికి
నిప్పంటించి చలి కాచుకునే
వైప్లవి-
జనాలను జాగృతం
చేస్తూ, జైల్లో మగ్గుతూ,
బాధలూ, అపజయాలూ, విజయాలూ,
లేదంటే---
జ్ఞాని, వేత్త,
- జీవితంలోని ఆనందం వెతుకుతూ,
సంగీతంలో, సాహిత్యంలో,
దేశాల్లో, శాసనాల్లో,
మళ్లీ పుట్టబోతామా?, ఈ అందం, ఈ ఆనందం, అంతా
ఇప్పుడే.
హుమ్! మనిషికి ఎన్ని
ఆలోచనలు, ఎన్ని ప్లానులు
అసలిన్నాళ్లూ
ఏం చేసినట్లు?
ఒంట్లో సత్తువ
ఉంది, వయసు ఉంది,
అందుకని ఏది దొరికితే
అది చేస్తూ-----
ఈ పూటకు భోజనం-----
మీ పిల్లలకు ట్యూషన్
చెపుతా!
మూడు రూపాయలు దినానికి,
ఓ! మట్టి తట్టలెత్తుతా-
తీరిక వేళల్లో
తైత్తిరీయం వ్యాఖ్యానం
చదువుతూ-
ఏం చేయాలి? ఏది చేయాలి?
గుడ్డల షాపులో
గుమాస్తాగా---- రాజీనామా,
పత్రికలో పడుతున్నాను,
వ్యాసాలు, వ్యవసాయాలు,
బట్టతలపై జుట్టు,
నిత్యం వార్తల
కొట్టు,-----ఛీఛీ,--
జేబుల్లో చిల్లరైనా
లేకుండా రైలెక్కాను,
ఎవరిచ్చారీ పతా
- నాకు తెలియదు – నాకూ తెలియదు
-
ఇక్కడా అక్కడా
– ఊరూరా---
తిరుగుతూ ----
ఇదేం బాగులేదు
– చదువుకుంటే,
ఏదైనా చేస్తే –
లాయర్ – డాక్టర్ – ఇంజనియర్
---- ఏదయినా ---
చదువు – పరీక్ష – పాస్ –
ప్రతి అడుగునా
ఆహ్వానం – దోస్తీ – ప్రేమ –
అన్నీ చేయవచ్చు
– తుడిపేయవచ్చు,
ఈ ప్రపంచానికి
నోటీసు జారీ చేస్తూ----
ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః
ఈ రంగస్థలంపై – ముప్ఫైమూడేళ్లకు
తాను – అందరి ముందూ తాను – చప్పట్లు
–
నేనేం చేయగలను
– ఉన్న
వెయ్యిన్నొక్క అవకాశాల్లో
వెయ్యి చెల్లిపొయినట్లున్నాయి
–
అసలన్నిటిలోనూ
– నిజంగా
తనకు పనికి వచ్చేది – ఒకటే
కాదూ – అందుకేనేమో –ఆలోచన మానకుండా
– భయం
అన్నది ఎరుగక – చివరికి ఈరోజు
చిక్కిపోయి ఇలా ----
ఈ 33కు కూడా – యిలా వర్షాలతోనే
– ఎండలతోనే
– తనకూ
నెలన్నా, ఈ ఎండలన్నా – నక్షత్రాలన్నా,
రాశులన్నా ఎంతో యిష్టం
–
ఆ నక్షత్రాల మీద
అభిమానం ఇప్పుడు లేదు
– పోయింది
–
ఈ నెలంతా ఎండ – ఉక్క
– చిరాకు
– చికాకు
–
మూటా ముల్లే సర్దేసి
– గది
వదిలేసి – గతాన్ని వదిలేసి – పారిపోవాలి
–
తప్పించుకుని
------
ఈ సంవత్సరమన్నా
స్వేచ్ఛగా –
ఈ గదీ – ఈగోడలూ – ఈ మనుషులూ
–
అన్నిటికీ దూరంగా
–
పాలవాడూ – పేపరువాడూ
– డబ్బులివ్వాలి
– ఇంటివాళ్లకు
చెప్పాలి –
లేకుంటే అప్పులు
– భవబంధాలు
కాదూ –
మళ్లీ తనపాతచోటికే
–
తన్నుతాను గుర్తించిన
– నిద్రనుంచి
మేల్కున్న
ఆ పాతచోటికే –
గది ఖాళీయే –ఏదో చిల్లర
వస్తువులు తప్ప – ఈ చెత్తంతా
ఏ చేయాలి
పుస్తకాలు బొమ్మలు,
నిక్ నాక్స్ – సర్పరాయి, ఎక్కడినుంచి
వచ్చినయి ఇవన్నీ
ఏమిటీ బొమ్మ నాలుగు
గుర్రాలూ – ఆరు కా ళ్లూ – రెండు తలలూ
– ఒకటే
నీడా –
అర్థం లేదు – అంతపెద్ద
సూర్యుడు – అర్జునుడు మాత్రం
అరంగుళమే – నీడలు మూరెడు -----
మసరబారి మాసిపోయిన
బొమ్మలు - ---
ఉట్టి బొమ్మలేకదా
----- పడెయ్ -----
ఈ చిపిగిన సిల్కు
చొక్కా - దుమ్మ కొట్టుకుని
– ఈ గవ్వలూ
– ఈ రాళ్లూ
---
ఎండిపోయిన గులాబీ
– ఎవరికీ
అందకుండానే వాడిపోయి
– ఎండిపోయి
–
పోస్టుచేయని ఉత్తరాలు
– ప్రియతమా
– మహారాజ్ఞీ
– గురువుగారూ
---
మంటకు అన్నీ సమానమే
--- బూడిద –
కాలుతున్న పేజీల్లో
కదులుతున్న అక్షరాలు
–
గాలిలో కలుస్తున్న
అక్షరాలు
ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః
చుట్టూ ఉన్న జనాలనుంచి
తప్పించుకోవాలి ---
కొత్తవాళ్లను
కట్టుకోగూడదు
తనింక జనాల్లో
బతకలేడు
ఈ మనుషుల మధ్య
తను మైనపు ముద్దగా –
ఎవరిష్టం వచ్చిన
రూపం – వాళ్లిస్తుంటే –
కనకిష్టాయిష్టాలూ
– అస్తిత్వమూ
లేవా –
లాభం లేదు – తనరూపం
తనకుంది – ఉండాలి –
ఇకమీద లాభం లేదు
– ఇక్కడ
ఈ మనుషున మధ్య ఇది వీలయ్యేపనా
అందుకనే అక్కడికి
– ఆ పాతచోటికి
– తిరిగిపోయి
------
ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః