ముప్ఫయిమూడు -
రెండవభాగం
తనకక్కడ ఒక ఆకారం
– అందరూ
కలిసి ఇచ్చిన ఆకారం – అది వదిలేసి
వచ్చాడా – అదే మళ్లీ ---- అప్పుడంటే
చిన్నవాడు – అందుకని అలా ఊరుకున్నాడు
– ఇప్పుడు
మరి తప్పించుకోను వీల్లేదు
– మొదటినుంచి
– మళ్లీ
మొదలు – అలాకాదు – ఆగాలి –
వాడు మౌళి – వాడికెప్పుడూ
సాయం కావాలి –
వాడికి అందరి మీదా
అనుమానమే –
అన్నీ తనవల్లేనంటాడు
–
తనదగ్గర ఉన్నదంతా
వాడికే అయిందప్పుడు –
ఇప్పుడు వాడు బాగు
పడ్డాడు – దశ తిరిగింది –
తన డబ్బు తిరిగి
ఇస్తాడా వాడు –
అడిగితే ఎముకలు
విరుస్తాడేమో
అనాడంటే వాడికి
అవసరం – తరువాత తనగురించి
కథలల్లాడు – తన పరువు తీశాడు
– కొంచెం
కొంచెమే –
అందరి మాటలనూ అందుకుని
– మరింత
పెంచి – మౌళి- కనిపించిన ప్రతి
పురుగుతోనూ – తనగురించి – సానుభూతిగా
– వాడు
లేకుంటే వాడినీడలు – దూరందాకా
–ఘోరంగా
– మౌళి
– అంతంలేనివాడు
– ఆఘాయిత్యాలవాడు
– కేవలం
అప్పు కోసం - -- ఇలా --- ఇంతనీచంగా
-----
వాడికి నళినీ
తెలుసు ------
ఈ సంవత్సరం
చెడ్డదిలాగుంది - అరిష్టాలన్నీ
తనపైకి – దూసుకువస్తూ – విరుచుకుపడుతూ
– ఇప్పటితోనేనా
– జీవితాంతం
– బతికినన్నాళ్లూ
– తనని
కరుస్తూ – కాలుస్తూ – వీడొకడు – మౌళి ------
ఈ మౌళిగాళ్లనందరినీ
ఎదుర్కోవాలి – ఎందరో – ఎందరో ---- అందరినీ
--- కానీ ---వీడుమాత్రం ఒక్కడే
–పిచ్చెత్తుతున్నట్టు
– నిజంగా
ఫ్రెండంటూ ఎవడన్నాఉన్నాడా
– అన్నట్టు
– అంతా
మోసం ----
నళిని----
తనని క్షమించినట్టు
మాట్లాడుతూ –
ఆనాడు బ్లాక్ మెయిల్
చేసి, భయపెట్టి, సర్వనాశనం
చేసి, ఎప్పుడది, మొన్నమొన్ననే
---- కొన్నిసంవత్సరాలైనా
కాలేదు ---
ఇప్పుడు
తాను ఫ్రెండా ఎంతతెలివిగా
---కలుపుగోలుగా --- కరుణతో
---అవును --- ఇప్పుడు తనకు
పెళ్లి అయిపోయిందిగా
---
తానే ఒప్పుకున్నాడు
– మోసం
చేశానని --- అన్యాయంగా ---
ఇప్పుడు నళినికొక
పాపకూడా ----
తనకేమీ పట్టనట్టు
మాట్లాడుతుందేమి
తనకు బాధలేనట్టుందేమి
ఆడవాళ్లు అంతేనేమో
అశ్చర్యం --- ఆనిండుతనం
--- ఆ నిర్లక్ష్యం ---
తనదే తప్పా ---నమ్మకం
కలగకుండా --- తను అలా పారిపోతే
తప్పక ఇంకో మగవాణ్ణి
కట్టుకున్నదనుకుంటూ
----- యింకా --- నయం ----
తనదే తప్పా నళినీ
--- తాను కూడా అలానే అనుకుంటున్నట్టు
---నీదే తప్పోయ్ ---
ఛీ నేనేం చేశాను
బాధపట్టలేక అప్పుడలా
అనుకున్నాను – ఇప్పుడంచా క్లియర్
గా ఉందికదూ --- కానీ యిలా
అనుకుంటే --- ఇదేమీ బాగుండలేదు
ఈ సంవత్సరం అంతా
సర్వనాశనం కాకుండా ఉంటే
ఉంటే అదే పదివేలు ---
అజంతా గుహలు చూడవచ్చు
--- అహమదాబాదూ వెళ్లవచ్చు
ఃఃఃఃఃఃఃఃఃఃఃఃః
ఈ పాతఊరు --- ఎంతో
అందంగా ఉంటుంది ---అయినా
ఇక్కడ బతకడం మాత్రం కష్టం
--- సహం మిత్రులు --- పూర్తి
మిత్రులూ --- వాడు మౌళి ---
మౌళిగానికి మౌళిగాంటే
పడదు --- వాళ్లిద్దరికీ
ఈ మూడో మౌళిగాంటే మంట
---- నీవు నిలబడ్డ నీడను అందరూ
తలొకదిక్కునుంచి చిల్లులు
పొడుస్తూ -----
నీకందరూ కావాలి
--- నీవందరికీ కావాలి --- ఆమాట
మాత్రం నోట్లోంచి రాదు
---
తప్పించుకోనూ
లేవు --- నావు ఏసాకుచెప్పినా
సవాలక్ష అర్థాలు ---
ఉత్తరంరాయకుంటే
నీకు గర్వమంటారు --- ఆలస్యం
చేస్తే అర్భకుడంటారు
---
కానీ ఇదంతా ఎప్పుడు
ఎట్లా మొదలయింది ---సంఘంచేతిలో
తాను ఆనాడు అట్లా చిక్కిననాడేకదా
బతకాలంటే ఒకతనలోనుంచి
ఇంకొకడు – ఇంకొకడు – ఇంకెందరో --- వస్తూ
--- మంచితనం – మైత్రి – ఉన్నాయా – నీవు నమ్మకపోతే
– నిన్నూ
నమ్మరు ----
అపనమ్మకం – అంతదాకా
--- అందరిమీదా --- చస్తేనే
అన్నీ సమసిపోతాయి ---
ఎండలు – రోజులను కొలిమిలోవేసి
కాలుస్తూ --- సమ్మెటవేస్తూ
--- కాలం ప్రతిధ్వనిస్తూ
---
సముద్రం అలిసిపోయింది
--- గాలీ అలిసింది
--- నేలా అలిసింది ---
మనిషి – మాంసం – వాని శరీరానికి
లంచం ---- ఏటిగట్టున, ఇసుకతిన్నెల్లో
శరీరాల లంచం -----
ఎండలూ సమసిపోతాయి
– అందుకనే
ఆలోపలే అందరినీ మింగేయాలని
తాపత్రయపడుతూ ---
ఆ ఇసుకల్లో, ఆరాళ్లలో,
ఆ గుడిసెల్లో, ఆ చెట్లల్లో,
అమ్మాయిలు హత్తుకుంటూ
---
ఊళ్లో మధ్యాహ్నం
ఎండలో, మసక తెరల చాటుగా,
మగతనిద్ర మాటుగా, హైహీల్డ్
చెప్పులు జారిపడితే,
ముందున్న నడుం వాటేసుకుని
– సారీ
----
ఆ ఎండల్లో – అంతా నిశ్శబ్దం
– ఉలుకూ
పలుకూ లేకుండా ---
నగరంనుంచి నదిదాకా
--- నల్లకళ్లూ – పిల్లికళ్లూ – ఈ ఆకలి
– ఆ ఆకలి
--- ఇసుకలో వెలుగూ –చెట్లకింద
చీకటి ---ఎండల్లో పడుతూ
లేస్తూ ---
సూర్యుడూ అలిసిపోయాడు
– ఏరోజుకారోజే
– ఆలస్యం
చేస్తున్నాడు --- త్వరగా
లేస్తున్నాడు ---
నీళ్లు – నీళ్లు
– దప్పిక
– ఏరు
ఎండిపోతున్నది –
అందరినీ ప్రేమిస్తున్నాడా
మూకుమ్మడిగా ---
ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః