మాహియా
అనేది పంజాబీ జానపద కవితా
విధానం.
ఇందులో
మూడు పాదాలుంటాయి.
మొదటి,
మూడవ పాదాలకు ప్రాస ఉంటుంది.
రెండవ
పాదం లేకున్నా కవితకు
అర్ఠం ఉంటుంది.
నేను
తెలుగులో కొన్ని మాహియాలు
రాశాను.
చదివి
అభిప్రాయం తెలియజేయండి.
***
పల్లె
ఒడిలొ పుట్టాను.
బతుకు మీద ఆశలు
పెరిగి
పక్కకెలా
జరిగాను?
***
రోజంతా
గడిచింది
ఇక తప్పనిదొకటుంది
రాతిరి
వచ్చేస్తుంది.
***
ఊహల ఈ
ఉయ్యాల
తలకిందులుగా
ఉంది!
చక్కగెలా
చెయ్యాల?
***
నడిచొచ్చే
స్వప్నాలు
నడి రోడ్డున గజిబిజిగా
పడి
పగిలినాయి! ఇకచాలు!!
***
పేదవాడి
కడుపే ఆకలి
ఏ రకంమయినా ఒకటే!
కలవారికి
నిలువున ఆకలి!!
***
కోరికలు
కోట్లుగ ఉన్నయ్
కానున్నది ఎవరికి
తెలుసు?
ఆశలు
పలు మెట్లుగ ఉన్నయ్!
***
ప్రతి
సంగతి అరకొరగుంది
తెలవారితె వెలుగొస్తుంది
నిద్ర
కూడ అవసరముంది!
***
కానున్నది
కాకమానదు
ఎదిరిస్తే గాలి
నిలవదు
రేపన్నగి
రాక మానదు!
***
కొలనులోన
కలువలు పూస్తయ్
ఆధారం
ఉంటే తాలు
ఆలోచనలెన్నో
వస్తయ్!
***
ముందుకు
పదమంటాడు
ముక్కు పెద్దదేమో
పాపం!
దారి
తడుముతుంటాడు!!
****