Vijayagopal's Home Page

Kahlil Gibran Contd...

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

More from "Sand and Foam" of Kahlil Gibran
with my Telugu translation.

ఇసుక - నురగ

 

Now let us play hide and seek. Should you hide in my heart it would not be difficult to find you. But should you hide behind your own shell, then it would be useless for anyone to seek you. A woman may veil her face with a smile.
ఇప్పుడు మనం దాగుడు మూతలాడదాం. నీవు నా మనసులో దాగుంటే తెలుసుకోవడం కష్టం కాదు. కానీ నీవు నీలోనే దాగుంటే, ఎవరయినా నీ గురించి ప్రయత్నించడం దండగ. ఒక ఆడమనిషి తన ముఖాన్ని చిరునవ్వుతో కప్పుకో గలదు.


How noble is the sad heart who would sing a joyous song with joyous hearts.

దుఃఖంలో ఉన్న మనసు ఆనంద హృదయాలతో కలిసి ఆనంద గీతం పాడగలిగితే, అదెంత గొప్పది.


He who would understand a woman, or dissect genius, or solve the mystery of silence is the very man who would wake from a beautiful dream to sit at a breakfast table.
ఒక ఆడమనిషిని అర్థం చేసుకో గలిగినా, తెలివిని ఛేదించ గలిగినా, నిశ్సబ్దంలోని రహస్యాన్ని విప్పిచెప్పగలిగినా ఆ మనిషి అందమయిన కలనుండి లేచి హాయిగా తిన గలుగుతాడు.


I would walk with all those who walk. I would not stand still to watch the procession passing by.

నేను నడిచే అందరితో కలిసి నడుస్తాను. నడిచే ఊరేగింపును ఊరికే చూస్తూ మాత్రం నిలబడలేను.


You owe more than gold to him who serves you. Give him of your heart or serve him.
నీకు సేవలందించిన వానికి బంగారం కన్నా ఎక్కువే బాకీ పడిపోతావు. అతనికి నీ మనసయినా ఇవ్వు, లేదంటే అతనికి సేవ చెయ్యి.


Nay, we have not lived in vain. Have they not built towers of our bones?
లేదు, మన బతుకు దండగ కానే కాదు. మన ఎముకలతో గోపురాలే కట్టినారుగదా.


Let us not be particular and sectional. The poet's mind and the scorpion's tail rise in glory from the same earth.
మనమేదీ అంతగా పట్టించుకే గూడదు. కవి మనసు తేలు తోక ఒకే మట్టినుంచి గొప్పగా పుట్టినవి మరి.


Every dragon gives birth to a St. George who slays it.
విచిత్ర మృగం తనను చంపే వాడిని తానే పుట్టించుకుంటుంది.


Trees are poems that the earth writes upon the sky. We fell them down and turn them into paper that we may record our emptiness.
భూమి ఆకాశం మీద రాసే కవితలే చెట్లు. మనం వాటిని పడగొట్టి కాయితం తయారు చేసుకుంటాం. మన రిక్తతను రాసుకుంటాం.


Should you care to write (and only the saints know why you should) you must needs have knowledge and art and music -- the knowledge of the music of words, the art of being artless, and the magic of loving your readers.
నీవు రాయాలనుకుంటే (ఎందుకు రాయాలో దేవుడే ఎరుగును) నీకు విజ్ఞానం, కళ, సంగీతం తెలిసి ఉండాలి. మాటలలోని సంగీతం, కళ లేకుండా ఉండడమనే కళ, నీ చదువరులను ప్రేమించడమనే ఇంద్రజాలం నీకు తెలిసి ఉండాలి.


They dip their pens in our hearts and think they are inspired.
వారు తమ కలాలను మన మనసుల్లో ముంచి, ప్రేరణ పొందామనుకుంటారు.


Should a tree write its autobiography it would not be unlike the history of a race.
ఒక చెట్టు గనుక తన ఆత్మకథ రాయగలిగితే, అది ఒక జాతి చరిత్ర కన్నా వేరుగా ఉండదు.


If I were to choose between the power of writing a poem and the ecstasy of a poem unwritten, I would choose the ecstasy. It is better poetry.

కవిత రాయడంలో ఉన్న శక్తి, రాయబడని కవితలోని ఆనందాలలో ఏది ఎంచుకుంటావంటే నేను ఆనందం కావాలంటాను. ఆదే మంచి కవిత.

But you and all my neighbors agree that I always choose badly.
కానీ నీవూ నా పక్కనుండే వాళ్లందరూ, నా ఎంపిక బాగుండదని ఒప్పుకుంటారు.


Poetry is not an opinion expressed. It is a song that rises from a bleeding wound or a smiling mouth.
కవితంటే భావాల ప్రకటన కాదు. అది రక్తం కారే గాయం నుంచి, లేదంటే చిరునవ్వే నోటినుంచి పుట్టే పాట.


Words are timeless. You should utter them or write them with a knowledge of their timelessness.
మాటలు కాలాతీతమయినవి. ఆ సంగతి తెలుసుకుని మాత్రమే వాటిని వాడుకోవాలి.


A POET IS a dethroned king sitting among the ashes of his palace trying to fashion an image out of the ashes.

కవి అంటే రాజ్యం పోగొట్టుకున్న రాజు. అతను తన నగరు కాలిన బూడిదలో కూచుని, అందులోనుంచి ఒక రూపం సిద్ధం చేయాలని ప్రయత్నిస్తుంటాడు.


Poetry is a deal of joy and pain and wonder, with a dash of the dictionary.
కవిత అంటే సంతోషం, బాధ, ఆశ్చర్యాల కలగలుపు. కొంచెం నిఘంటువు కూడా ఉంటుందందులో.


In vain shall a poet seek the mother of the songs of his heart.
తన హృదయగీతాల మాత కోసం కవి వ్యర్థంగా ఆశిస్తాడు.


Once I said to a poet, "We shall not know your worth until you die."
And he answered saying, "Yes, death is always the revealer. And if indeed you would know my worth it is that I have more in my heart than upon my tongue, and more in my desire than in my hand."
నీవు చచ్చేదాకా నీ విలువ మాకు తెలియదు – అన్నాను నేనొక కవితో.

అతనన్నాడుగదా – అవును, మృత్యువు అన్నింటినీ బయట పెడుతుంది. నిజంగా నీకు నా విలువ తెలిస్తే, నా నాలుక మీదకన్నా మనసులో, నా చేతిలో కన్నా కోరికలో ఎక్కువ సంగతి ఉందని అర్థం.

If you sing of beauty though alone in the heart of the desert you will have an audience.
నీవు అందం గురించి గానం చేస్తే, అది నీ మనసనే ఒంటరి ఎడారిలో నయినా నీకు శ్రోతలుంటారు.


Poetry is wisdom that enchants the heart.
Wisdom is poetry that sings in the mind.
If we could enchant man's heart and at the same time sing in his mind,
Then in truth he would live in the shadow of God.
కవితంటే మనసును ఆనంద పరిచే తెలివి.

తెలివంటే మనసులో గానం చేస్తుండే కవిత.

మనం గనుక మనిషి మనసుకు ఆనందం కలిగించ్, అదే సమయంలో అతని మెదడులో గీతాలు పాడగలిగితే,

సత్యంగా అతను దేవుని నీడలో జీవిస్తాడు.

Inspiration will always sing; inspiration will never explain.
ప్రేరణ ఎప్పుడూ పాడుతుంది. ప్రేరణ ఏనాడూ వివరించదు.


We often sing lullabies to our children that we ourselves may sleep.
మనం పిల్లలకు జోలపాటలు పాడేది మనం నిద్ర పోవాలనే.


All our words are but crumbs that fall down from the feast of the mind.
మాటలంటే మనసులో జరిగే విందులోనుండి జారి పడే మిగుళ్లు మాత్రమే.


Thinking is always the stumbling stone to poetry.
కవితకు ఆలోచన రాయిలా అడ్డు తగులుతుంది.


A great singer is he who sings our silences.

మన నిశ్శబ్దాలను పాడ గలిగిన వాడే గొప్ప గాయకుడు.

How can you sing if your mouth be filled with food?
How shall your hand be raised in blessing if it is filled with gold?
నోటినిండా తిండి ఉంటే పాట ఎలా పాడగలవు

చేతినిండా బంగారముంటే, ఆశీర్వదించడం ఎలా కుదురుతుంది

They say the nightingale pierces his bosom with a thorn when he sings his love song.
So do we all. How else should we sing?
నైటింగేల్ పక్షి ప్రేమ పాట పాడే ముందు తన ఎదను ముల్లుతో గుచ్చుకుంటుందంటారు.

మనమూ అంతే. లేకుంటే పాట ఎట్లా

Genius is but a robin's song at the beginning of a slow spring.
తెలివంటే, నెమ్మదిగా వచ్చే వసంతానికి ముందు రాబిన్ పాడే పాట తప్ప మరోటి కాదు.


Even the most winged spirit cannot escape physical necessity.
ఎంత రెక్కలున్న దేవతయినా భౌతిక అవసరాలనుండి తప్పించుకో లేదు.


A madman is not less a musician than you or myself; only the instrument on which he plays is a little out of tune.
ఒక పిచ్చి మనిషి నీకూ నాకంటే తక్కువ పాటగాడేమీ కాదు. అతని వాయిద్యం కొంచెం శృతి తప్పి ఉంటుందంతే.


The song that lies silent in the heart of a mother sings upon the lips of her child.
తల్లి మనసులో నిశ్శబ్దంగా ఉండే గీతం, బిడ్డ పెదవుల మీద పలుకుతుంది.


No longing remains unfulfilled.
ఏ కోరికా తీరకుండా మిగిలి పోదు.


I have never agreed with my other self wholly. The truth of the matter seems to lie between us.
నేను నా మరో వ్యక్తిత్వపు అభిప్రాయాలతో ఏనాడూ పూర్తిగా అంగీకరించలేదు. అసలు నిజం మా యిద్దరి మధ్యనే ఉంటుంది.


Your other self is always sorry for you. But your other self grows on sorrow; so all is well.
నీ మరో వ్యక్తిత్వం నిన్ను చూచి ఎప్పుడూ బాధ పడుతుంది. కానీ దుఃఖమే దానికి బలం. కనుక ఫరవా లేదు.


There is no struggle of soul and body, save in the minds of those, whose souls are asleep and whose bodies are out of tune.
ఎవరి ఆత్మలు నిదురించి ఉన్నాయో, ఎవరి శరీరాలు శతి తప్పి ఉన్నాయో, వారి మెదళ్లలో తప్ప, ఆత్మకు శరీరానికి మధ్య పోరాటం లేనే లేదు.


When you reach the heart of life you shall find beauty in all things, even in the eyes that are blind to beauty.
నీవు జీవితపు హృదయంలోకి చేరిన తర్వాత, అన్నింటిలోనూ అందాన్ని చూడగలుగుతావు. అందాన్ని చూడలేని ఆకళ్లలో కూడా.


We live only to discover beauty. All else is a form of waiting.
మనం అందాన్ని కనుగొనడానికే బతికి ఉంటాం. మిగతాదంతా ఒక రకమయిన నిరీక్షణ.


Sow a seed and the earth will yield you a flower. Dream your dream to the sky and it will bring you your beloved.
ఒక విత్తనం నాటితే, భూమి నీకొక పువ్వునిస్తుంది. ఆకాశమంత ఎత్తు కలలు గను, నీ ప్రేయసి నీకందుతుంది.


The devil died the very day you were born.
Now you do not have to go through hell to meet an angel.
నీవు పుట్టిననాడే దెయ్యం చచ్చింది.

ఇప్పుడు నీవు దేవదూతను కలవడానికి నరకం ద్వారా నడవనవసరం లేదు.

Many a woman borrows a man's heart; very few could possess it.
చాలా మంది ఆడవాళ్లు మగవారి మనసులను అరువు తీసుకుంటారు. కొందరు మాత్రమే దాన్ని స్వంతం చేసుకో గలరు.


If you would possess you must not claim.
నీకు స్వంతమయిన దాన్ని నీది అనగూడదు.


When a man's hand touches the hand of a woman they both touch the heart of eternity.
ఒక పురుషుని చెయ్యి ఒక స్త్రీ చేతిని తాకితే, వారిద్దరూ అనంత హృదయాన్ని అందుకుంటారు.


Love is the veil between lover and lover.
ఇద్దరు ప్రేమికుల మధ్యనుండే తెరయే ప్రేమ.


Every man loves two women; the one is the creation of his imagination, and the other is not yet born.
ప్రతి మనిషి ఇద్దరాడవాళ్లను ప్రేమిస్తాడు. ఒకరు అతని ఊహలో పుడతారు, మరొకరు ఇంకా పుట్టి ఉండరు.


Men who do not forgive women their little faults will never enjoy their great virtues.
ఆడవాళ్ల చిన్న చిన్న తప్పులను క్షమించలేని మగవారు, వారి గొప్ప గుణాలను గుర్తించలేరు.


Love that does not renew itself every day becomes a habit and in turn a slavery.
ప్రతి నిత్యం కొత్తదనం పొందని ప్రేమ అలవాటు అవుతుంది. అది బానిసత్వంగా మారుతుంది.

*******************************************************

ఇంకా ఉంది....