Vijayagopal's Home Page

Kahlil Gibran 5

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

One more instalment of Kahlil Gibran's Sand and Foam. I have also tried to translate the gems into Telugu. Friends should tell me how useful my effort is!

Part V
Generosity is not in giving me that which I need more than you do, but it is in giving me that which you need more than I do.
దాతృత్వమంటే, నీకన్నా నాకెక్కువ అవసరమయిన దాన్ని ఇవ్వడం కాదు. నాకన్నా నీకెక్కువ అవసరమయిన దాన్ని నాకివ్వడం అసలు దాతృత్వం.
You are indeed charitable when you give, and while giving, turn your face away so that you may not see the shyness of the receiver.

దానం చేస్తున్నప్పుడు నువ్వు నిజంగా గొప్పవాడివే. కానీ దానం అందుకుంటున్న వారి లోని సిగ్గును చూడకుండా ముఖం అటు తిప్పుకో.

The difference between the richest man and the poorest is but a day of hunger and an hour of thirst.

అందరికన్నా ధనికునికీ, అందరికన్నా బీదకూ తేడా, ఆకలిగొన్న ఒక దినం, దప్పిగొన్న ఒక గంట మాత్రమే.

We often borrow from our tomorrows to pay our debts to our yesterdays.

నిన్ననుండి చేసిన అప్పులను తీర్చడానికి మనం తరుచుగా రేపటి దగ్గర అప్పు తెచ్చుకుంటాం.

I too am visited by angels and devils, but I get rid of them.
When it is an angel I pray an old prayer, and he is bored;
When it is a devil I commit an old sin, and he passes me by.

నా దగ్గరికి కూడా దేవతలూ దయ్యాలూ వస్తారు. నేను వాళ్లను వదిలించుకుంటాను.

దేవత వస్తే పాత ప్రార్థన పాడతాను. అతనికి వేసట పుడుతుంది.

దెయ్యం వస్తే ఒక పాత పాపం చేస్తాను. అతనే నన్ను తప్పించుకుపోతాడు.

After all this is not a bad prison; but I do not like this wall between my cell and the next prisoner's cell;
Yet I assure you that I do not wish to reproach the warder not the Builder of the prison.

మొతాతనికీ జైలు అంత చెడ్డదేం కాదు. కానీ నా గదికీ పక్క ఖైదీ గదికీ మధ్యనున్న గోడ మాత్రం నాకు నచ్చదు. అయినా అధికారినీ భవనం కట్టిన వారినీ అడగనని మీకు భరోసా ఇస్తాను.

Those who give you a serpent when you ask for a fish, may have nothing but serpents to give. It is then generosity on their part.

చేప అడిగితే పామునిచ్చే వారి దగ్గర పాము తప్ప మరేమీ లేకపోవచ్చు. అది వారి పక్షాన దాతృత్వమే అవుతుంది.

Trickery succeeds sometimes, but it always commits suicide.

కిటుకులు కొంత కాలం పని చేస్తాయి. తరువాత ఆత్మహత్య చేసుకుంటాయి.

You are truly a forgiver when you forgive murderers who never spill blood, thieves who never steal, and liars who utter no falsehood.

రక్తం చిందించని హంతకులనూ, ఎప్పుడూ దొంగతనం చేయని దొంగలనూ, అబద్ధమాడని అసత్యవాదులనూ క్షమిస్తున్నావంటే, నీవు నిజంగా క్షమాగుణం గలవాడివి.

He who can put his finger upon that which divides good from evil is he who can touch the very hem of the garment of God.

మంచిని చెడు నుంచి వేరు చేసే విషయం మీద వేలు ఉంచ గలిగిన వాడే, దేవుని వస్త్రపు అంచును తగలగలిగిన వాడు.

If your heart is a volcano how shall you expect flowers to bloom in your hands?

నీ మనసు అగ్నిపర్వతమయితే, మరి నీ చేతిలో పూలు విచ్చుకుంటాయని ఎలా ఆశించ గలవు

A strange form of self-indulgence! There are times when I would be wronged and cheated, that I may laugh at the expense of those who think I do not know I am being wronged and cheated.

ఇది ఒక వింత రకం ఆత్మ స్తుతి. నా పట్ల తప్పులు మోసాలు జరిగిన సందర్భాలున్నాయి. ఆ సంగతి నాకు తెలియదనుకునే వారిని చూచి నేను నవ్వుకుంటాను.

What shall I say of him who is the pursuer playing the part of the pursued?

అతను వెంటబడున్నవాడు, కానీ వెంట ఎవరో పడుతున్నట్టు నటిస్తాడు. అతని గురించి ఏమనను

Let him who wipes his soiled hands with your garment take your garment. He may need it again; surely you would not.

తన మట్టి చేతులను నీ గుడ్డకు తుడిచిన వాడిని ఆ గుడ్డను తీసుకెళ్లనీ. ఆతనుకది తిరిగి అవసరం రావచ్చు. నీకు మాత్రం దాని అవసరం రాదు.

It is a pity that money-changers cannot be good gardeners.

డబ్బులతే వ్యాపారం చేసేవారు మంచి తోటలను పెంచలేకపోవడం, పాపం అనిపించే పరిస్థితి.

Please do not whitewash your inherent faults with your acquired virtues. I would have the faults; they are like mine own.

సహజంగా ఉన్న లోపాలను, నేర్చుకున్న సద్గుణాలతో రంగు పులమాలని దయచేసి ప్రయత్నించకు. నా తప్పులను నేనే ఉంచుకుంటాను. అవి నా స్వంతం మరి.

How often have I attributed to myself crimes I have never committed, so that the other person may feel comfortable in my presence.

నేను చేయని నేరాలను నేనెన్ని సార్లు ఒప్పుకోలేదు. ఆ మరో మనిషి మరి నాముందు సుకంగా ఉంటాడాయె.

Even the masks of life are masks of deeper mystery.

జీవితం ముసుగులు కూడా, లోతయిన రహస్యాల ముసుగులే.

You may judge others only according to your knowledge of yourself.
Tell me now, who among us is guilty and who is unguilty?

నీకు తెలిసిన నీ తెలివ ఆధారంగా నీవు ఇతరులను అంచనా వేస్తావు.

ఇప్పుడు చెప్పు మరి, మనలో దోషులెవరు, నిర్దోషులెవరు

The truly just is he who feels half guilty of your misdeeds.

నీ పొరపాట్లకు సగం తాను బాధపడే మనిషి నిజంగా న్యాయపరుడు.

Only an idiot and a genius break man-made laws; and they are the nearest to the heart of God.

పిచ్చివాడు, మహా మేధావి మాత్రమే మనిషి చేసిన చట్టాలను ఉల్లంఘిస్తారు. వారు దేవుని మనసుకు దగ్గరివారు మరి.

It is only when you are pursued that you become swift.

నీ వెంట ఎవరేనా పడితేగాని, నీవు వేగం అందుకోవు.

I have no enemies, O God, but if I am to have an enemy
Let his strength be equal to mine,
That truth alone may be the victor.

నాకు శతృవులు లేరు, ఓ దేవుడా, నాకే శతృవు కలిగితే

అతని శక్తి నాతో సమంగా ఉండనీ

ఒక్క నిజం మాత్రమే గెలుస్తుంది.



You will be quite friendly with your enemy when you both die.

ఇద్దరూ చచ్చిన తర్వాత నావూ, నీ శతృవుతో చాలా సఖ్యంగా ఉంటావు.

Perhaps a man may commit suicide in self-defense.

బహుశః ఒక మనిషి ఆత్మహత్యకు తన్ను తాను రక్షించుకోడానికే పాలు పడతాడు.

Long ago there lived a Man who was crucified for being too loving and too lovable.
And strange to relate I met him thrice yesterday.
The first time He was asking a policeman not to take a prostitute to prison; the second time He was drinking wine with an outcast; and the third time He was having a fist-fight with a promoter inside a church.

మరీ ప్రేమిస్తూ, మరీ ప్రేమ పాత్రుడయినందుకు చాలా కాలం క్రితం ఒకతన్ని శిలువనెక్కించారు.

చెపితే చిత్రంగా ఉంటుంది గాని నేనతడిని నిన్న మూడు మార్లు కలిశాను.

మొదటి సారి అతను ఒక వేశ్యను జైలు పాలు చేయ వద్దని పోలీసును అడుగుతున్నాడు. రెండవసారి అతను సంఘం వెలివేసిన వ్యక్తితో బాటు మద్యం తాగుతున్నాడు. ఇక మూడవసారి అతను జైలులో ఒక ప్రొమోటర్ తో ముష్ఠియుద్ధం చేస్తున్నాడు.



If all they say of good and evil were true, then my life is but one long crime.

మంచిచెడులను గురింటి అందరూ చెప్పేది నిజమయితే, నా బతుకు ఒక సుదీర్ఘమయిన నేరం.

Pity is but half justice.

దయ అంటే సగం న్యాయం తపంప మరోటి కాదు.

THE ONLY ONE who has been unjust to me is the one to whose brother I have been unjust.

నా పట్ల అన్యాయంగా ఉండిన ఒకే ఒక్కడెవరంటే, వాని తోబుట్టువు పట్ల నేనన్యాయం చేసినవాడు.

To page 6

More to follow!